కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ CONSTABLE PRELIMINARY WRITTEN TEST 2022 అఫిషియల్ కీని తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) రిలీజ్ చేసింది. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు న ఆగస్ట్ 28న నిర్వహించిన పరీక్షకు దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. బోర్డ్ రిలీజ్ చేసిన ప్రిలిమినరీ కీ ప్రకారం అయిదు ప్రశ్నలకు సమాధానాలు గందరగోళంగా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులందరికీ అయిదు (5) మార్కులు కలుపనున్నారు. ఈ ప్రశ్నలను అటెంప్ట్ చేసినా.. చేయకున్నా మార్కు కలుపుతారు.
ప్రిలిమినరీ కీలో ఉన్న సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలుంటే.. 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీలోగా అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు బోర్డు గడువు నిర్ణయించింది. అఫిషియల్ వెబ్సైట్లో అందుకు సంబంధించిన లింక్ రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది.