ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2024 నుండి ప్రారంభం అయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి మే 05, 2024చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనంతరం అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, కంప్యూటర్ స్కిల్ టెస్టులతో కూడిన ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు -37
జీత భత్యాలు: రూ. 48,440-1,37,220
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, సీపిటి