Homeస్టడీభారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ టాపిక్​ చదివితే కనీసం 3 నుంచి 5 మార్కులు మీ సొంతం.

Advertisement

పాకిస్థాన్ (3323 కి.మీ.)

పాక్ తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు – గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, లడ్డాబ్, జమ్మూ
కశ్మీర్
• పాకిస్థాన్తో అత్యధిక సరిహద్దును పంచు కుంటున్న రాష్ట్రం రాజస్తాన్ (1170 కి.మీ.)
• పాకిస్థాన్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం – పంజాబ్(425 కి.మీ.)
• ఇండియా- పాకిస్థాన్లను వేరుచేసే సరిహద్దు విభజన రేఖ: సర్ రాడ్ క్లిఫ్ రేఖ– దీనిని 1947
భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం (లేదా) జాన్-3 ప్రణాళిక ప్రకారం (లేదా) డిక్కీ బర్డ్
ప్రణాళిక(లేదా) మౌంట్ బాటన్ ప్రణాళికా ప్రకారం ఏర్పాటు చేశారు.
• పాకిస్తాన్ – గుజరాత్​ లను వేరు చేసే విభజన రేఖ – 24° సమాంతర రేఖ(పాకిస్తాన్ 1948లో
ఏర్పాటు చేసింది. దీనిని ఇండియా గుర్తించడం లేదు)

జమ్మూ కశ్మీర్ లో సరిహద్దు రేఖలు

  1. అంతర్జాతీయ సరిహద్దు రేఖ – పాక్ ఆక్రమిత కశ్మీర్​ను పాకిస్థాన్​ ను వేరు చేస్తుంది.
  2. ఎల్ఓసీ(లైన్ ఆఫ్ కంట్రోల్)– పాక్ ఆక్రమిత కశ్మీర్​ను పాకిస్థాన్​ ను వేరు చేస్తుంది.
  3. ఏజీపీఎల్(యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్)- పాక్ ఆక్రమిత కశ్మీరు ను లడ్డాఖ్​ ను వేరు
    చేస్తుంది.
    • ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో వివాదాస్పద ప్రాంతం- సియాచిన్
    • సియాచిన్​ ను కాపాడేందుకు 1984లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్: ఆపరేషన్
    మేఘదూత్

    • ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం- సియాచిన్
    • సియాచిన్ హిమానీనదం వద్ద భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలు- సాల్తోరా పర్వతాలు
    • ఇండియా – పాకిస్థాన్​ ల మధ్య గుజరాత్​ లో వివాదాస్పద ప్రాంతాలు: రాన్ ఆఫ్ కచ్, సర్
    క్రీక్
    • రాన్ ఆఫ్ కచ్: ఉప్పుతో కూడిన చిత్తడి నేలలు. దీని మొత్తం వైశాల్యం 9000 చదరపు
    కి.మీ. ఇందులో 800 చ.కి.మీ. భూభాగాన్ని 1948లో పాకిస్థాన్ ఆక్రమించింది.
    • సర్ క్రీక్: గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలోని ఉమ్మడి జలాలైన ‘షాలో
    జలాల్లో ఉన్న పొడవైన సన్నని జల భాగాలను క్రీక్ అని పిలుస్తారు. ఉదా: కోరి
    క్రీక్(ఇండియా), ఖజార్ క్రీక్(పాక్), సర్ క్రీక్ అందులో అతిపెద్దది. దీని గుండా 240
    సమాంతర రేఖ వేళ్తుంది. దీనిని 2012లో ఇరు దేశాలు చెరిసమానంగా పంచుకున్నాయి.
    • షాలో జలాలు: సముద్రంలోని 6 మీ. లోతు కలిగిన ప్రాంతాన్ని షాలో జలాలు అంటారు.

ఆఫ్ఘానిస్థాన్ (106 కి.మీ.)

• ఆఫ్ఘానిస్థాన్తో సరిహద్దును పంచుకునే భారతీయ ప్రాంతం: లడ్డాఖ్
• ఇండియా – ఆఫ్ఘానిస్థాన్ ను వేరుచేసే విభజన రేఖ – డ్యూరాండ్ రేఖ. దీనిని 1893లో
ల్యాండ్స్ డౌన్ కాలంలో గీశారు. ఇది పాకిస్థాన్ ఆఫ్ఘానిస్థాన్లను కూడా వేరు చేస్తుంది.
• మనదేశంతో అతి తక్కువ సరిహద్దును కలిగిన దేశం
• ఆఫ్ఘానిస్థాన్లోని హరి నదిపై సల్మా ప్రాజెక్టును భారతదేశం నిర్మించింది. దీనినే
‘ఫ్రెండ్​ షిప్ డ్యామ్’ అని పిలుస్తారు. 2016లో నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.
చబహర్ పోర్ట్ ఒప్పందం: 2016లో ఇండియా–ఇరాన్– అఫ్టానిస్థాన్​ మధ్య ఈ ఒప్పందం
జరిగింది​
• చబహార్ ఓడరేపు ఇరాన్​లో ఉంది. దీనికి భారత్​ లీజుకు తీసుకొని అభివృద్ధి చేస్తోంది.

• చైనా గ్వాదర్ ఓడరేవు నుంచి పాకిస్థాన్ పీఓకే మీదుగా CPEC(China Pakistan Economic Corridor)ను ఏర్పాటు చేస్తుంది. దీనిని ఇండియా వ్యతిరేకిస్తుంది.

Advertisement

చైనా(3488 కి.మీ.)

• చైనాతో సరిహద్దును పంచుకునే భారతీయ ప్రాంతాలు: లడ్డాబ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్
• చైనాతో అధిక సరిహద్దు పంచుకుంటున్న కేంద్ర పాలిత ప్రాంతం- లడ్డాఖ్
• చైనాతో అధిక సరిహద్దును పంచుకుంటున్నరాష్ట్రం- అరుణాచల్ ప్రదేశ్
• చైనాతో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం- సిక్కిం
• భారత్, చైనాల సరిహద్దును 3 సెక్టార్లుగా విభజించారు

పశ్చిమ సెక్టార్ (Western Sector):
భారత్లోని లడాఖ్​ కు, చైనాలోని సికియాంగ్ ప్రావీన్స్​ కు మధ్య ఈ ప్రాంతం ఉంది.
ఇక్కడ చైనా ఆక్రమించుకున్న భూభాగం పేరు- ఆక్సాయ్ చీన్ (లాధాఖ్),
ఇక్కడ ఉన్న సరిహద్దు రేఖ – Line of Actual Control (LOAC)/ వాస్తవాధీన రేఖ.
ఇక్కడ చైనా 38,000 చ.కీ.మీ. భూభాగాన్ని ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ 5180
చ.కి.మీ. భూభాగాన్ని, 1963లో చైనా- పాకిస్థాన్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు
అక్రమంగా పొందింది. దీనిని చైనా సీడెడ్ కశ్మీర్ అని పిలుస్తారు.

మధ్య సెక్టార్ (Middle Sector) చైనాలోని టిబెట్ ప్రాంతానికి, భార్లోని ఉత్తరాంచల్,
హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల మధ్య ఈ ప్రాంతం ఉంది.

Advertisement

తూర్పు సెక్టార్ (Eastern Sector) చైనాలోని టిబెట్ ప్రావిన్స్క భారత్లోని అరుణాచల్
ప్రదేశ్కు మధ్య ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ చైనా ఆక్రమించుకున్న భూభాగం పేరు
సమత్ జంగ్.
ఈ ప్రదేశంలో భారత్, చైనా మధ్యగల సరిహద్దు రేఖ- మెక్ మోహన్ రేఖ (1914లో గీశారు).
చైనా మెక్మెహన్ రేఖను అంగీకరించడం లేదు.


ఇండియా – చైనా మధ్య 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ప్రధానమైన అంశాలు…
ఎ) ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వ అధికారాలను
పరస్పరం గౌరవించుకోవాలి
బి) పరస్పరం దురాక్రమనకు పాల్పడకూడదు
సి) పరస్పరం ఒకరి అంతరంగిక విషయాల్లో
మరొకరు కల్పించుకోకూడదు
డి) అంతర్జాతీయ వేదికల మీద ఒకరికి ఒకరు సహకరించుకోవాలి
ఇ) అంతర్జాతీయ వ్యాపారంలో ఒకరికొకరు
సహకరించుకోవాలి
• ఇండియా – చైనా మధ్య 1962లో యుద్ధం జరిగింది.

నేపాల్ (1751 కి.మీ.)

నేపాల్ లో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు: సిక్కిం, ఉత్తరప్రదేశ్, బిహార్,
పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్
• నేపాల్ తో అధిక సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బిహార్
• నేపాల్ తో తక్కువ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం- పశ్చిమ బెంగాల్(96 కి.మీ.)
ఇండియా – నేపాల్ మధ్య ఇటీవల వివాదాస్పదంగా మారిన ప్రాంతాలు: కాలాపానీ, లిపులేఖి, లింపియదుర
• 2015లో నేపాల్ కు కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా 2020లో నేపాల్
కొత్త మ్యాప్ లను విడుదల చేసింది. ఈ మ్యాప్ లో భారత భూభాగానికి చెందిన పై మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా పేర్కొన్నది.
• 1816లో ఇండియా – నేపాల్ – బ్రిటిష్ మధ్య ‘సుగౌలీ’ అనే సరిహద్దు ఒప్పందం కుదిరింది.
• ఈ ఒప్పందం ప్రకారం ఇండియా – నేపాల్ మధ్య కాళీ నదిని సరిహద్దుగా గుర్తించారు.
• ఈ ఒప్పందం ప్రకారం గూర్ఖాలను మన సైన్యంలోకి తీసుకుంటున్నారు.

Advertisement

భూటాన్ (699 కి.మీ.)

• భూటాన్ తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం,
పశ్చిమ బెంగాల్
• భూటాన్ తో అధిక సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం – అసోం
• భూటాన్ తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం – సిక్కిం

డోక్లాం వివాదం: ఇండియా – చైనాల మధ్య 2017లో జూన్ 16 నుంచి 28 ఆగస్టు వరకు
కొనసాగింది. డోక్లాం పీఠభూమి భూటాన్లో ఉంది. ఈ ప్రాంతంలో చైనా రోడ్ల నిర్మాణాన్ని
ప్రారంభించడంతో గొడవ మొదలైంది. ఇక్కడ చైనా ప్రవేశంతో భారత సార్వభౌమత్వానికి
కూడా ప్రమాదం ఏర్పడుతుంది.

డోక్లాం పీఠభూమి పశ్చిమ బెంగాల్లోని సిలిగురి (చికెన్ నెక్- కోడి మెడ ప్రాంతానికి దగ్గరగా ఉంది. సిలిగురి ప్రాంతం 22 కి.మీ.వెడల్పు కలిగి ఉంది. ఈ ప్రాంతం మీద చైనా పట్టు సాధిస్తే ఈశాన్య
రాష్ట్రాలతో మన దేశానికి రోడ్డు కనెక్టివిటీ తెగిపోతుంది

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!