రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2910 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వీటిని భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. దీంతో ఈ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
తాజాగా ఆర్థిక శాఖ అనుమతించిన పోస్టులు
గ్రూప్ 3 | 1373 |
గ్రూప్ 2 | 663 |
అగ్రికల్చర్ | 347 |
వెటర్నరీ | 294 |
కో ఆపరేటివ్ | 99 |
గోడౌన్స్ | 50 |
సీడ్ సర్టిఫికేషన్ | 25 |
హర్టికల్చర్ | 21 |
ఫిషరీస్ | 15 |
ఎలక్ట్రిసిటీ | 11 |
మార్కెటింగ్ | 12 |
గ్రూప్ 2 పోస్టుల ఖాళీల వివరాలు
ముందుగా ప్రకటించిన గ్రూప్ 2 పోస్టులు ఈ ఉత్తర్వులతో పెరిగాయి. గతంలో 582 ఖాళీలను ప్రకటించగా.. ఈ ఉత్తర్వుల్లో వీటి సంఖ్య 663కు పెరిగాయి. విభాగాల వారీగా ఖాళీల జాబితా..