తెలంగాణ ఐసెట్ 2024 దరఖాస్తులను గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్స్ సమర్పించేందుకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్నప్తుల మేరకు ఎలాంటి లేటు ఫీజు లేకుండా మే 7వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించున్నట్లు ఐసెట్ కన్వీనర్ నేడుప్రకటించారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ టీ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నర్సింహాచారి కలిసి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 550, ఇతరులు రూ. 750 ఫీజు చెల్లించి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా తప్పులు , పొరపాట్లు ఉంటే అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. మే 28వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం..జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. జూన్ 15న ప్రాథమిక కీ, జూన్ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాల స్వీకరణ, జూన్ 28వ తేదీన ఫైనల్ కీ, ఫలితాలను జూన్ 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.