భారత్‌లో పార్లమెంటరీ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటాడు. రాజ్యాంగరీత్యా రాజ్యాధినేత లేదా దేశాధినేతగా వ్యవహరిస్తాడు.
– రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ లేదా నియోజకగణం లేదా ప్రత్యేక ఎన్నిక గణం ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, ఎన్నికైన రాష్ట్రాల శాసన సభ్యులు, ఎన్నికైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ్యులు ఉంటారు.
– రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు, రాజ్యసభకు నామినేట్ అయ్యే 12 మంది విశిష్ట ప్రముఖులు, రాష్ట్ర శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్స్, విధాన పరిషత్ సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్ శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు భాగం కారు.
– రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా ఎన్నుకుంటారు. దీనినే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య పేపర్ బ్యాలెట్ ఎన్నిక అంటారు.
రాష్ట్రపతి ఎన్నిక విధానంలో వేర్వేరు ఓటర్లకు(ఎంపీలు, ఎమ్మెల్యేలు) వేర్వేరు ఓటు విలువలు ఉంటాయి. ఈ ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో ఉండే జనాభాపై ఆధారపడి ఉంటుంది.
– ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఓటు విలువను నిర్ణయిస్తున్నారు. 2026 వరకు 1971 జనాభా లెక్కల ప్రకారం ఓటు విలువను లెక్కించాలి అని 2001లో 84వ రాజ్యాంగ సవరణ చేశారు. ఇది 2002 నుంచి అమలులోకి వచ్చింది.
– రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు. తమ సభ్యులకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేయరాదు.
– ఎమ్మెల్యేల ఓటు విలువ = రాష్ట్రం మొత్తం జనాభా/ ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య X 1/1000
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే ఓటు విలువ = 148
– తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ = 132
– అత్యధికంగా ఓటు విలువ ఉత్తర్‌ప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఉంది – 208
– అతి తక్కువ ఓటు విలువ సిక్కిం ఎమ్మెల్యేలకు ఉంది – 7
– ఎంపీ ఓటు విలువ = అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ (28 రాష్ట్రాలు + 3 కేంద్రపాలిత ప్రాంతాలు )/ ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య
– 2017 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎంపీ ఓటు విలువ = 708
– రాష్ట్రపతి నామినేషన్ సందర్భంలో అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగా 50 మంది, ద్వితీయంగా మరో 50 మంది సమర్థించాలి. రూ.15,000 డిపాజిట్ చెల్లించాలి.
– పోలైన ఓట్లలో 1/6వంతు ఓట్లు పొందని అభ్యర్థి డిపాజిట్ కోల్పోతారు.
– రాష్ట్రపతి ఎన్నికలో ఒక అభ్యర్థి గెలుపొందాలంటే ఒక నిర్ణీత కోటాలో (50శాతం కంటే ఎక్కువ) ఓట్లు పొందాల్సి ఉంటుంది.
– రాష్ట్రపతి ఎన్నికలకు రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఒకసారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఒకసారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏదైనా వివాదం సంభవిస్తే దానిని సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాలి.
– ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీ ఏర్పడినంత మాత్రాన దానిని కోర్టులో సవాల్ చేయరాదు అని 1961లో 11వ రాజ్యాంగ సవరణ చేశారు.
– 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు.
- భారత మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రచించిన గ్రంథం ఇండియా డివైడెడ్.
- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవీ కాలంలో ఉండగా దేశంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఆయన రచనలు ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఆన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్.
- అతి తక్కువ కాలం పని చేసిన రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ (1967–69)
- పదవిలో ఉండగా రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్(1969), ఫక్రుద్దీన్ అలీ అహ్మద్(1977) మరణించారు.
- జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రెండో రాష్ట్రపతి వి.వి.గిరి. ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి.
- వి.వి.గిరి మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటూ రాజీనామా చేశారు.
- రాష్ట్రపతి వి.వి.గిరిపై 1970లో మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ఆ తర్వాత ఆ తీర్మానం ఉపసంహరించారు.
- ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి(1977–82)
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా శంకర్‌దయాళ్ శర్మ బాధ్యతలు నిర్వర్తించాడు.
- భారత మొదటి దళిత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణ్(1997–2002)
- సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం
- భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. రాజస్థాన్ గవర్నర్‌గా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా, రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రచించిన గ్రంథాలు ఆఫ్ ద ట్రాక్, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్, The coalition years, The Presdential years