HomeLATESTకరెంట్​ అఫైర్స్​: ఫిబ్రవరి 2024

కరెంట్​ అఫైర్స్​: ఫిబ్రవరి 2024

అంతర్జాతీయం

Advertisement

భారత్, మాల్దీవులు, శ్రీలంక ‘దోస్తీ’ ఎక్సర్ సైజ్
సముద్ర భద్రత, పరస్పర చర్యను పెంపొందించడానికి హిందూ మహాసముద్రంలో త్రైపాక్షిక వ్యాయామం జరిగింది. భారత్, మాల్దీవులు, శ్రీలంక నుంచి కోస్ట్ గార్డ్ సిబ్బంది హిందూ మహాసముద్రంలో పెరగుతున్న సవాళ్లు గుర్తించేందుకు నేవీ ఎక్సర్ సైజ్ ను ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య దోస్తీ-16 ఎక్సర్ సైజ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ పరిశీలకుడిగా పాల్గొంది.

పంజాబ్​ తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్​
పాకిస్థాన్‌లో అత్యధిక జనాభా కలిగిన పంజాబ్‌ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నవాజ్​ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీకి చెందిన మరియంకు327 సీట్లు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీలో 220 ఓట్లు లభించాయి.

చంద్రుడి ఒడిలో ఒడిస్సియస్​
అమెరికాలోని హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో విజయవంతంగా ల్యాండ్​ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది.

Advertisement

ఇరాన్ వీసా ఫ్రీ ప్రోగ్రాం
భారతీయులకు వీసా మినహాయింపు కల్పించిన దేశాల వరుసలో ఇరాన్ చేరింది. ఇరాన్ దేశంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి వీసా ఫ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు ఇరాన్ పర్యాటక మంత్రి తెలిపారు. భారత్​తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం వీసా-ఫ్రీ ప్రోగ్రామ్‌ను ఆమోదించింది.

మాల్దీవుల ప‌ర్యాట‌కుల జాబితాలో ఐదో స్థానం
ఇరు దేశాల మధ్య విభేదాలతో భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి మాల్దీవులను అత్యధికంగా సందర్శించిన పర్యాటకుల సంఖ్య పరంగా రష్యా(18,561 మంది) తొలి స్థానానికి చేరింది. తర్వాతి స్థానాల్లో ఇటలీ, చైనా, బ్రిటన్‌, భారత్‌(13,989) నిలిచాయి.

ఫ్రెంచ్‌ నేర్చుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌
భారత విద్యార్థులు ఫ్రెంచ్‌ భాష నేర్చుకొనేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ‘క్లాసెస్‌ ఇంటర్నేషనలేస్‌’అనే ప్రత్యేక ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. దీని ద్వారా ఏడాదిపాటు ఫ్రాన్స్‌­లో ఉండి ఫ్రెంచ్‌ నేర్చుకోవచ్చు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ, అధ్యక్షుడు మెక్రాన్‌ ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌
పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను నామినేట్‌ చేస్తూ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి పదవి రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) చైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ స్పష్టం చేశారు.

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్‌ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్టు గతేడాది కంటే ఒక స్థానం పడిపోయి 85వ స్థానంలో ఉంది. భారత్​ వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించే వీలుంది.

ఆర్థిక మాంద్యంలోకి జపాన్
జపాన్‌ మాంద్యంలోకి జారిపోయింది.2023 చివరి త్రైమాసికంలో జీడీపీ క్షీణతతో, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌.. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. భారత్​ ఐదో స్థానంలో ఉంది.

Advertisement

ప్రపంచ అవినీతి సూచీ
ప్రపంచ అవినీతి సూచీలో భారత్‌ గతేడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ రిపోర్టు ప్రకారం–2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్‌ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్‌ ర్యాంక్‌ 85గా ఉంది.

జాతీయం

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్​
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డులు ప్రకటించారు. యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్‌ వంగా ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నెగెటివ్‌ రోల్‌ బాబీ డియోల్​ (యానిమల్), అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన జవాన్‌ సినిమాకు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు.

Advertisement

ధర్మ గార్డియన్​ విన్యాసాలు
భారత్‌, జపాన్‌ మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా ‘ధర్మ గార్డియన్‌’ పేరిట ఇరుదేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ప్రారంభించాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు ఈ విన్యాసాలు రాజస్థాన్‌లోని మహజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో కొనసాగనున్నాయి. ఇరుదేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది పాల్గొంటారు.

ఫోన్​ పే నుంచి ఇండస్​ యాప్​ స్టోర్​
గూగుల్​ యాప్ ​స్టోర్​కు పోటీగా ఫిన్​టెక్​ సంస్థ ఫోన్​పే ఇండస్ యాప్‌‌స్టోర్ కన్జూమర్ ​వెర్షన్‌‌ను ప్రారంభించింది. దీంతో యూజర్లు 45 కేటగిరీ లలో 2 లక్షలకు పైగా మొబైల్ అప్లికేషన్స్​, గేమ్స్​ డౌన్‌‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ యాప్‌‌లు 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంటాయి.

ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న
కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు ఎల్‌కే అద్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారతరత్న’ ప్రకటించించారు.

Advertisement

దేశంలో 718 మంచు చిరుతలు
దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. అందులో అత్యధికంగా లద్దాక్‌లో 477 చిరుతలు ఉన్నట్లు తేలింది.

పట్టాలెక్కనున్న ‘స్లీపర్‌ వందే భారత్‌’
దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-–హౌరా, ఢిల్లీ–-ముంబై మధ్య నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది.

దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు రెండు కోట్ల మంది(18- నుంచి 29 వయసు) యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పుడు ఆరు శాతం అధికంగా ఓటర్లు నమోదైనట్లు తెలిపింది.

Advertisement

పీఎం సూర్య ఘర్‌.. ముఫ్త్‌ బిజ్లీ యోజన
దేశంలోని కోటి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో ‘పీఎం సూర్య ఘర్‌.. ముఫ్త్‌ బిజ్లీ యోజన’ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పథకంలో భాగంగా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు.

పంటల బీమాకు ప్రత్యేక పోర్టల్‌
ప్రధాన మంత్రి ఫసల్‌ (పంట) బీమా పథకంతోపాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్‌ పద్ధతిలో అందించడానికి ‘సారథి’ పోర్టల్‌ను ప్రారంభించారు. పంటల బీమా ఫిర్యాదులను పరిష్కరించడానికి కిసాన్‌ రక్షక్‌ పోర్టల్‌నూ, 14447 నంబరు హెల్ప్‌ లైన్‌నూ ప్రారంభించారు.

దేశంలో 718 మంచు చిరుతలు
దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. అందులో అత్యధికంగా లద్దాక్‌లో 477 చిరుతలు ఉన్నట్లు తేలింది.

Advertisement

పట్టాలెక్కనున్న ‘స్లీపర్‌ వందే భారత్‌’
దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-–హౌరా, ఢిల్లీ–-ముంబై మధ్య నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది.

తమిళ సినీ హీరో విజయ్‌ కొత్త పార్టీ
ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్‌ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరును ‘తమిళగ వెట్రి కళగం’గా పేర్కొన్నారు. అంటే ‘తమిళనాడు విజయ పార్టీ’ అని దానర్థం. త్వరలోనే పార్టీ జెండా, ఎజెండాలను వెల్లడిస్తానని తెలిపారు.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక అంశాలతో ఉన్న బిల్లును సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది.

Advertisement

విశాఖలో ‘మిలాన్‌’ మెరుపులు
2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం.. తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్‌–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తుంది. మిలాన్‌–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్‌ (ఐక్యత)–కొలాబరేషన్‌(సహకారం)’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

గిన్నిస్​ రికార్డుకు కథక్​ నృత్యం
ఒకే సమయంలో 1,484 కళాకారులు కలిసి మధ్యప్రదేశ్​లోని ఖజురహో దేవాలయ ప్రాంగణంలో కథక్​ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్​ రికార్డ్​ సాధించారు. 50వ నాట్య ఉత్సవాల్లో వీరందరు ‘రాగ బసంత్​’ అనే పాటకు 20 నిమిషాలు డ్యాన్స్​ వేశారు.

మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్స్​
మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్‌లో 64 శాతం, బిహార్‌లో 69 శాతం, గుజరాత్‌లో 59 శాతం, పశ్చిమబెంగాల్‌లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

భారత్​ కంపెనీల్లో ‘రిలయన్స్‌’ టాప్
భారత్‌లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మొదటిస్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). టీసీఎస్‌ రూ.12.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.11.3 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ పేర్కొంది. 2018లో ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

పిల్లలకు బ్లూ ఆధార్​ కార్డ్​
ఆధార్‌ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు.

ప్రాంతీయం

మీడియా అకాడమీ చైర్మన్​
రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా ప్రభుత్వం శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో కూడా ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు.ప్రస్తుతం ప్రజాపక్షం ‘ఎడిటర్’ గా ఉన్నారు.

హైదరాబాద్‌లో డ్రోన్‌ పోర్ట్‌
హైదరాబాద్‌ పరిసరాల్లో 20 ఎకరాల్లో డ్రోన్‌ పోర్ట్‌ నిర్మాణం కోసం సీఏం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ)తో డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది.

‘పద్మశ్రీ’ గ్రహీతలకు రూ.25 లక్షల నజరానా
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా, ప్రతినెలా రూ.25 వేల పింఛను అందిస్తుందని ప్రకటించారు.

హైదరాబాద్‌లో డ్రోన్‌ పోర్ట్‌
హైదరాబాద్‌ పరిసరాల్లో 20 ఎకరాల్లో డ్రోన్‌ పోర్ట్‌ నిర్మాణం కోసం సీఏం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ)తో డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది.

‘పద్మశ్రీ’ గ్రహీతలకు రూ.25 లక్షల నజరానా
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా, ప్రతినెలా రూ.25 వేల పింఛను అందిస్తుందని ప్రకటించారు.

ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజయ్య
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ ను నియమిస్తూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌
వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా హైదరాబాద్​కు చెందిన సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని ఎన్నికయ్యారు. చైర్మన్‌గా పోటీలో ఆయన ఒక్కరే ఉండటం, డైరెక్టర్లంతా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

వార్తల్లో వ్యక్తులు

జస్టిస్ అజయ్ మాణిక్‌ రావ్ ఖాన్విల్కర్‌
లోక్‌పాల్ చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులును రాష్ట్రపతి నియమించింది. జస్టిస్ అజయ్ మాణిక్‌ రావ్ ఖాన్విల్కర్‌ను చైర్‌పర్సన్‌గా నియమించగా, జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్ , జస్టిస్ రితు రాజ్ అవస్థీ, సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీ సభ్యులుగా నియమితులయ్యారు.

అనంత రవితేజ
అసాధారణ ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 (ఐన్‌స్టీన్‌ వీసా) వీసా తిరుపతి యువకుడికి లభించింది. వాషింగ్టన్‌లోని ఆపిల్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా అనంత రవితేజ పనిచేస్తున్నారు.

అజిత్‌ మిశ్ర
బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అజిత్‌ మిశ్రకు ప్రతిష్టాత్మక ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు దక్కింది. యూకే, ఇండియా లీగల్‌ పార్ట్‌నర్‌షిప్‌ (యూకేఐఎల్‌పీ)కు వ్యవస్థాపక అధ్యక్షుడైన అజిత్‌ అక్కడ అందించిన న్యాయ, ప్రజాసేవలకు గుర్తింపుగా జనవరి 23న ఈ అవార్డు ప్రదానం చేశారు.

మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌
305 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో వాల్టన్‌ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ రాజ కుటుంబం అవతరించింది. ఆయన సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.

హాగే గాంగోబ్‌
నమీబియా అధ్యక్షుడు హాగే గాంగోబ్‌ క్యాన్సర్​తో మరణించారు. దేశ రాజధాని విండ్‌హక్‌లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైన హాగే గాంగోబ్‌ అప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్నారు.

మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌
305 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో వాల్టన్‌ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ రాజ కుటుంబం అవతరించింది. ఆయన సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.

గీతిక కౌల్‌
సైన్యానికి చెందిన కెప్టెన్‌ గీతిక కౌల్‌ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా నిలిచారు. పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్‌లో (సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో) విపరీతమైన చలి ఉంటుంది.

నరేంద్ర మోదీ
దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. 44 శాతం ప్రజాదరణతో ఆయన అగ్రస్థానం సాధించారు. మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో15 శాతంతో వాజ్‌పేయీ రెండో స్థానంలో, 14శాతంతో ఇందిరా గాంధీ మూడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అగ్ర స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండో స్థానంలో ఉన్నారు.

డాక్టర్‌ సమీర్‌ షా
బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారి భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు.72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు.

శశిథరూర్‌
ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్‌ ఢిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రెంచ్‌ సెనేట్‌ అధ్యక్షుడు జెరార్డ్‌ లాంచర్‌ షెవాలి డెలా లిజియన్‌ డి’హానర్‌ను థరూర్‌కు బహూకరించారు.

అశ్వత్‌ కౌశిక్‌
భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌ స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. క్లాసికల్‌ చెస్‌లో పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్‌ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు.

స్పోర్ట్స్​

టెస్టుల్లో నంబర్​వన్​ బౌలర్​
టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్‌ నుంచి ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. ఐసీసీ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో బిషన్‌ సింగ్‌ బేడి, రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా తర్వాత నంబర్​వన్​ బౌలర్​ అయ్యాడు.

సెమిస్​లో నిఖత్​
రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్‌ఫైనల్లో ఆమె 5-–0తో వాస్సిలా (ఫ్రాన్స్‌)ను ఓడించింది. ఈ బౌట్లో నిఖత్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది.

అండ‌ర్‌-–19 చాంపియన్​
అండ‌ర్‌-19 ప్రపంచ‌క‌ప్2024 విజేత‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో టీమ్ ఇండియా యువ జట్టు 79 పరుగుల తేడాతో ఆసీస్​ టీమ్​పై ఓడిపోయింది. ఆస్ట్రేలియా స్కోర్​ 253/7, భారత్‌ మాత్రం 174 పరుగుకే ఆలౌటైంది. అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నాలుగోసారి సాధించింది.

టెస్టుల్లో నంబర్​వన్​ బౌలర్​
టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్‌ నుంచి ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం సాధించడం ఇదే మొదటిసారి.

ప్రపంచకప్‌ షూటింగ్​లో గోల్డ్​
10 మీటర్ల షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ అమ్మాయిల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజతాలు భారత్‌ ఖాతాలోనే చేరాయి. 8 మంది తలపడ్డ ఫైనల్లో దేవాన్షి ధామ (240 పాయింట్లు), లక్షిత (238) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

స్విమ్మింగ్​లో ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్‌ పాన్‌ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

గగన్​యాన్​ వ్యోమగాములు
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో రోదసిలోకి వెళ్తున్న భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేశారు. గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అంగద్‌ ప్రతాప్, అజిత్‌ కృష్ణన్, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా ఉన్నారు. వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌’ను మోదీ ప్రదానం చేశారు.

భారత్‌కు ఎంక్యూ9-బీ రక్షణ
భారత్‌కు అత్యాధునిక సామర్థ్యాలున్న 31 ఎంక్యూ9-బీ డ్రోన్లు అందజేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద సముద్రంపై నిఘా కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, పదాతి దళం, వాయుసేన కోసం 16 స్కై గార్డియన్‌లను భారత్‌ దాదాపు 4 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయనుంది.

భారత్‌కు ఎంక్యూ9-బీ రక్షణ
భారత్‌కు అత్యాధునిక సామర్థ్యాలున్న 31 ఎంక్యూ9-బీ డ్రోన్లు అందజేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద సముద్రంపై నిఘా కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, పదాతి దళం, వాయుసేన కోసం 16 స్కై గార్డియన్‌లను భారత్‌ దాదాపు 4 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయనుంది.

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌14 ప్రయోగం సక్సెస్​
ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఫిబ్రవ‌రి 17న షార్​ నుంచి ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులపై అధ్యయనం చేయనుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!