తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మూడు విడుతల్లో ప్రవేశాలకు మే 6 నుంచి అప్లై చేసుకోవాలి. వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీల్లో ఈ సారి నాలుగు లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్
మే 6 తేదీ నుండి ను మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో అవకాశం. వెబ్ ఆప్షన్ లు మే 15 నుంచి మే 27 వరకు ఇచ్చుకోవాలి. జూన్3 తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్. జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్
ఫేస్ -2 రిజిస్ట్రేషన్స్ 400 రూపాయలతో జూన్ 4 నుంచి జూన్ 13 వరకు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు జూన్ 4 నుండి జూన్ 14 వరకు ఇచ్చుకోవాలి. జూన్ 18వ తేదీన రెండవ దశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జూన్ 19 నుంచి జూన్ 24 వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్
400 రూపాయలతో జూన్ 19 నుంచి జూన్ 25 వరకు చేసుకోవాలి. జూన్ 19 నుంచి జూన్ 25 వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. జూన్ 29 మూడోదశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జులై 8నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం బీకాం ఫైనాన్స్, కోర్సు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కొత్త కోర్సులు డిగ్రీలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు www.dost.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.