Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsలేటెస్ట్ కరెంట్ ఆఫైర్స్

లేటెస్ట్ కరెంట్ ఆఫైర్స్

  1. ఉక్రెయిన్ లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిని రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైంది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై రష్యా క్షిపణితో దాడికి పాల్పడింది.
  2. తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48గంటలపాటు నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలు , మీడియాతో మాట్లాడకూడదు.
  3. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్సంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జే.పి నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ . జైశంకర్ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు.
  4. వస్తు, సేవల పన్ను వసూళ్లు తొలిసారిగా రూ. 2లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోని ఇవి రూ. 2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ. 1.87 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 12.4శాతం అధికం.
  5. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఓ దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!