బల్వంతరాయ్ మెహతా కమిటీ: 1957 జనవరి 16న జాతీయ అభివృద్ధి మండలి ఏ కమిటీని నియమించింది. ఈ కమిటీ దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పంచాయతీ వ్యవస్థ ఉండాలని సూచించింది.
అశోక్‌మెహతా కమిటీ: 1977 డిసెంబర్ 12న మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో ఉండాలని సూచించింది.
దంత్వాలా కమిటీ: ఈ కమిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సిఫార్స్ చేసింది.
ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ: పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని ఈ కమిటీ సిఫార్స్ చేసింది.
పెసా చట్టం: గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసే ఉద్దేశ్యంతో ఈ చట్టం రూపొందించారు.
దేశంలో మొదటిసారి మండలపరిషత్ వ్యవస్థను 1985 అక్టోబర్ 2న కర్నాటక ప్రవేశపెట్టగా, 1986 జనవరి 13న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు.
1882 మే 18న లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల కోసం ప్రవేశ పెట్టిన తీర్మానం దేశంలో స్థానిక స్వపరిపాలనకు మాగ్నాకార్ట వంటిదిగా పేర్కొంటారు.
73వ రాజ్యాంగ సవరణ (గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు) 74వ రాజ్యాంగ సవరణ (పట్టణ స్థానిక ప్రభుత్వాలు)
1992లో రాజ్యాంగ సవరణ చేశారు రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 1992. అమలైన తేదీ 1993 ఏప్రిల్ 24 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీటిని రాజ్యాంగంలోని 9వ భాగం, 11వ షెడ్యూల్లో చేర్చారు 9A భాగం 12వ షెడ్యూల్లో చేర్చారు ఆర్టికల్స్ 243(A) నుంచి 243 (O) ఆర్టికల్ 243 (P) నుంచి 243 (ZG)
ఆర్టికల్స్ ఉమ్మడి అంశాలు
243(D) 243(T) రిజర్వేషన్లు (మహిళలకు 1/3, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా ఉండును)
243(E) 243(U) కాలపరిమితి (ఏ స్థానిక సంస్థకైన ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలి)
243(F) 243(V) సభ్యుల అనర్హతలు ( పోటీ చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి)
243(G) 243(W) అధికారాలు (పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న అధికారాలు)
243(H) 243(X) రెవెన్యూ (స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాలు అసెంబ్లీ నిర్ణయిస్తుంది.
243(I) 243(Y) ఆర్థిక సంఘం ( రాష్ట్ర, స్థానిక సంస్థల మధ్య ఆదాయ పంపిణీకి రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది.
243(J) 243(Z) ఆడిట్ (స్థానిక సంస్థలను ఆడిట్ చేయడానికి అసెంబ్లీ ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది)
243(K) 243(ZA) ఎన్నికల సంఘం (స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం ఉంటుంది)
243(L) 243(ZB) కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు
243(M) 243(ZC) మినహాయింపులు (నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, గూర్ఖాహిల్ , డార్జిలింగ్)
243(N) 243(ZF) రాష్ట్ర విధాన సభలు స్థానిక సంస్థల చట్టాలు సవరించుకుంటాయి
243(O) 243(ZG) స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు అధికారం ఉండదు.