రాష్ట్రలోని ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, కళాశాలల్లో ప్రవేశానికి JNTU ఆధ్వర్యంలో ఈఏపీసెట్ 2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ 9,10,11 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయనివెల్లడించారు. అన్ని పరీక్షలకు కలిపి ఇప్పటివరకు 3,54,843 మంది అప్లయ్ చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ప్రక్రియ షురూ అయినట్లు తెలిపారు. ఈఏపీసెట్ నిర్వహణపై వివరాలను వెల్లడించారు.
ఈ పరీక్షల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేస్తున్నట్లు లింబాద్రి తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తుల్లో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామనితెలిపారు. అభ్యర్థులను 90నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతిస్తామని..పరీక్ష ప్రారంభమ్యే సమయం దాటి నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని తెలిపారు. సెల్ ఫోన్ సహాఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని తెలిపారు. వాటర్ బాటిల్స్ వెంట తీసుకునిరావాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించేది లేదన్నారు. విభజన చట్టం జూన్ 2వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ రిలీజ్ అయిందని ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని స్ఫస్టం చేశారు. రూ. 5వేల లేట్ ఫీజుతో మే 4వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
హాల్ టికెట్లు eapcet.tsche.ac.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.