Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsతెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.
ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ కమిటీ నియమించారు.
కె.ఎస్​.థార్​ కమిషన్​: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించేందుకు భారత ప్రభుత్వం 1948లో ఈ కమిషన్​ నియమించింది.


జె.వి.పి కమిటీ: కె.ఎస్​.థార్​ కమిషన్​ నివేదికను పరిశీలించేందుకు జేవీపీ కమిటీని 1948లో నియమించారు.
పండిత్​ సుందర్​లాల్​ కమిటీ: జె.ఎన్​.చౌదరి పాలనలో కమ్యూనిస్టులు, ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం 1949లో నియమించింది.
ఎ.డి.గోర్వాలా కమిటీ: హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం 1950లో ఈ కమిటీని నియమించారు.


పింగిళి జగన్మోహన్​ రెడ్డి: సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీస్​ కాల్పులపై 1952లో ఈ కమిటీ నియమించారు.
వాంఛూ కమిటీ: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వచ్చే సమస్యలు పరిశీలించేందుకు 1953లో ఈ కమిటీ నియమించారు.
ఫజల్​ అలీ కమిషన్​: రాష్ట్రాల పునర్విభజనకు శాశ్వత ప్రాతిపదికత కల్పించుటకు ఈ కమిటీని 1953లో నియమించారు.


తెలంగాణ ప్రాంతీయ కమిటీ: పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 1958లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
కుమార్​ లలిత్​ కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు లెక్కించడానికి 1969లో ఈ కమిటీని నియమించారు.
వశిష్ట భార్గవ కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.


కె.ఎస్​.వాంఛూ కమిటీ: ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని 1969లో నియమించారు.
తార్కుండే కమిటీ: నక్సలైట్లపై జరిగిన బూటకపు ఎన్​కౌంటర్లపై విచారణకు 1977లో ఈ కమిటీని నియమించారు.
జయభారత్​ రెడ్డి కమిటీ: రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి 1984లో నియమించారు.


సుందరేషన్​ కమిటీ: జయభారత్​ రెడ్డి నివేదికలోని అంశాలు పరిశీలించుటకు 1985లో ఈ కమిటీని నియమించారు.
హితన్​భయ్యా కమిటీ: విద్యుత్​ రంగంలో సంస్కరణల కోసం 1998లో ఈ కమిటీని నియమించారు.
గిర్​గ్లానీ కమిషన్​: 610 జీవో, ఆరు సూత్రాల పథకం అమలు తీరు పరిశీలించేందుకు ఈ కమిటీని 2001లో నియమించారు.
ప్రణబ్​ ​ముఖర్జీ కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం 2005లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.


రోశయ్య కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి 2009లో ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ: ఆంధ్రప్రదేశ్​లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం, సూచనల కోసం 201‌‌0లో ఈ కమిషన్​ను నియమించారు.
ఆంటోని కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధివిధానాల రూపకల్పనకు 2013లో ఈ కమిటీ నియమించారు.


కమలనాథన్​ కమిటీ: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన సూచించడానికి 2014లో ఈ కమిటీని నియమించారు.
ప్రత్యూష సిన్హా కమిటీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో సివిల్​ సర్వీసెస్​ ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఈ కమిటీని నియమించారు.
హరగోపాల్​ కమిటీ: టీఎస్​పీఎస్​సీ పరీక్షల సిలబస్​ రూపకల్పనకు ఈ కమిటీని 2015లో నియమించారు.

DONT MISS TO READ :
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు

విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

16 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!