- భారత దేశంలో పులుల గణనను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 2023 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం దేశంలో మొత్తం 3167 పులులు ఉన్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో 2022 పులుల గణన నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాభై రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు.
- భారతదేశంలో ప్రాజెక్టు టైగర్‌ని 1973 ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌తో ప్రారంభించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రాజెక్టు టైగర్‌కి నాంది పలికారు.
- ప్రాజెక్టు టైగర్‌కి ముందు. సింహం, తరవాత రాయల్ బెంగాల్ టైగర్‌ను జాతీయ జంతువుగా ప్రకటించారు.
- ప్రాజెక్టు టైగర్‌ను ప్రారంభించినప్పుడు పులులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి భైగర్ రిజర్వులుగా ప్రకటించారు. ప్రారంభ నమయంలో ‘ ప్రకటించిన మొత్తం. తొమ్మిది టైగర్ రిజర్వులు 18278 చ.కి.మీ భూమిని అక్రమించాయి.
- ప్రస్తుతం దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75796 చకిమీ. భూభాగంలో విస్తరించి ఉన్నాయి. అంటే ఇవి దేశంలోని మొత్తం భూభాగంలో 2.3% ఆక్రమించాయి.
- 2006లో 1411 పులులు ఉండగా, వీటి సంఖ్య 2018లో 2967కు చేరుకుంది. తాజాగా విడుదలైన గణనలో 3167 పులులు ఉన్నట్లుగా గుర్తించారు. 2018 నాటితో పోలిస్తే దాదాపు 7% పెరుగుదల కనిపించింది.
- ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న పులుల్లో 75% భారత్‌లోనే ఉన్నాయి.
- పులుల సంరక్షణకు సంబంధించి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్ల్‌లో 2010లో జరిగిన సద
స్సులో ఒక డిక్లరేషన్ చేశారు. - ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్టర్వేషన్ ఆఫ్ నేచర్, నేచురల్ రిసోర్సెస్ ప్రకారం పులి
క్షీణిస్తూ ఉన్న జీవరాశి. - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎన్‌డేంజర్ “స్పీనీస్ జాబితాలో ఎపెండిక్స్1లో పులి
ఉంది. వైల్డ్ లైఫ్ చట్టం షెడ్యూల్ 1లో ఉంది. - 2018లో విడుదల చేసిన గణనలో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 526 పులులు ఉండగా, కర్షా
టకలో 524 ఉత్తరాఖండ్‌లో 442 ఉన్నాయి. ఈ జాబితాలో మూడు టైగర్ రిజర్వుల్లో పులుల
జాడ లేదు. (అవి పశ్చిమబెంగాల్‌లోని బక్సా రూర్థండ్‌లోని పాలమో, మిజోరాంలోని దంఫా టైగర్ రిజర్వులు.) - ప్రధాని నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ బిగ్‌కాట్ అలయన్స్ ప్రారంభిస్తూ ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అమృత్‌కాల్ కా టైగర్ విజన్ అనే వుస్తకంలో వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశంలో టైగర్ విజన్ ఎలా ఉండబోతుందో ప్రస్తావించారు.
- పులుల గణన పులులను కలిగి ఉండే ఆవాసాలను జీవ భూగోళశాస్త్రం, ఆవాసాల పరస్పర అనుసంధానం ఆధారంగా అయిదు ప్రధాన ప్రాంతాలుగా వర్గీకరించారు. అవి శివాలిక్ – గాంజటిక్ మైదానాలు; మధ్య భారత, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారత కొండలు, బ్రహ్మపుత్ర వరద మైదానాలు, సుందరబన్స్
- పశ్చిమ కనుమల్లో పులుల సంఖ్య 2018తో పోలిస్తే 2022 గణనలో తగ్గింది. ఇది 2018లో 981 పులులు ఉండగా ప్రస్తుత రిపోర్టులో 824 మాత్రమే ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఉన్న అన్షిదందేలి టైగర్ రిజర్వులో మాత్రమే పులుల నంఖ్య 2018తో పోలిస్తే పెరిగింది.
- శివాలిక్, గంగా మైదానాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పులుల జనాభాలో స్థానిక విలుప్తతను తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒడిశా లోని సత్కేషియా టైగర్ రిజర్వు, మహారాష్ట్ర లోని సహ్యాద్రి టైగర్ రిజర్వు, తమిళనాడులోనీ నిర్భి కన్యాకుమారి, శ్రీవిల్లిపుత్తూర్ ప్రాంతాల్లో గమనించారు.
- జయరాం రమేష్ రచించిన ‘ఇందిరాగాంధీ-ఏ లైఫ్ ఇన్ నేచర్ అనే వుస్తకంలో ఇందిరాగాందీని ఒక పర్యావరణ, ప్రకృతివేత్తగా ప్రస్తావించారు.
- ఇందిరాగాంధీ ఒక సందర్భంలో తన స్నేహితురాలికి ఉత్తరం రాస్తూ ‘నాకు అవకాశం వస్తే ఎత్తయిన పర్వతాల్లోకి. వెళ్లి ప్రశాంతంగా ప్రకృతి మధ్యన గడపాలనుకుంటున్నాను’ అని అన్నారు.
- ఇందిరాగాంధీ 1972 జూన్ 5న జరిగిన స్టాక్ హోమ్ సదస్సుకి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇది ప్రపంచంలోనే పర్యావరణానికి సంబంధించిన మొదటి పెద్ద సదస్సు.
- ఈ నదన్సులో ప్రపంచాన్ని ఉద్దేశించి స్వీడన్ ప్రధాని తరవాత మాట్లాడిన ఏకైక నేత ఇందిరాగాంధీ. ఆ సందర్భంలోనే జూన్ 5వ తేదీని వర్యావరణ దినోత్సవంగా ప్రకటించారు.
- ఆమె హయాంలోనే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48ఏ నిబంధనను ఆదేశిక నూత్రాల్లో జోడించారు. ఈ నిబంధన పర్యావరణ పరిరక్షణ, మెరుగుదల, అడవులు-వన్యప్రాణులను సంరక్షించడం గురించి తెలియచేస్తుంది.
- ప్రాథమిక విధుల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 51(ఎ) (జి) నిబంధనను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు.
- వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 నీటిచట్టం 1974, అటవీ సంరక్షణ చట్టం 1980, వాయు చట్టం 1981 ఇందిరాగాంధి హయాంలోనే అమలులోకి వచ్చాయి.
- ఉత్తరాఖండ్‌లోని తెహ్రి ఆనకట్టకు సంబంధించి పర్యావరణాన్ని కాపాడే చర్యలు, కేరళ లోని సైలెంట్ వ్యాలీలో ఉన్న కుంతి నదిపై కడుతున్న హైద్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రజల కోరిక మేరకు నిలుపు చేయించారు. చిప్కో ఉద్యమం ఆమె హయాంలో జరిగినప్పుడు అటవీ నిర్మూలనను నిషేధించారు.
- దేశంలో కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ, వన్య ప్రాణి పరిరక్షణ సాంస్కృతిక నమూనా కనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బిష్టయ్ ప్రజల సంస్కృతిలో కృష్ణజింక ఒక భాగం. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇదుమిష్క్ తెగ పులిని వారి పెద్దన్నలా చూనుకుంటారు.
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్