భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఉపయోగపడే విధంగా రన్నింగ్ నోట్స్ ఇక్కడ అందిస్తున్నం.
శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో హైందవ మతంలో కొత్త ధోరణులు ప్రవేశించాయి.
శంకరాచార్యులు:
- కేరళలోని కాలడిలో శంకరాచార్యులు జన్మించారు.
- ఈయన్ని ఆదిగురువుగా భావించి ఆదిశంకరాచార్యులుగా పిలుస్తారు.
- మాయా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రచ్ఛన్న బుద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు.
- శంకరుడు ప్రతిపాదించిన అద్వైతానికి మూలం బాదరాయణుడు రచించిన ఉత్తర మీమాంస.
- అద్వైత సిద్ధాంతానికి మూలం చాందోగ్యోపనిషత్లోని తత్వమసి.
- బౌద్ధ, జైనాలను తీవ్రంగా విమర్శించాడు. విగ్రహరాధనను సమర్థించాడు.
- శృంగేరి, ద్వారక, బద్రినాథ్, పూరి క్షేత్రాల్లో నాలుగు మఠాలను స్థాపించాడు.
- ఈయన మరణానంతరం ఇతని శిష్యులు కంచి మఠాన్ని స్థాపించారు.
- ఇతని బోధనలను అనుసరించే వారిని స్మార్తులు అంటారు.
- ఇతని గ్రంథం భజగోవిందం. సిద్ధాంతం అద్వైతం.
రామానుజాచార్యులు:
- శ్రీపెరుంబుదూర్‌లో రామానుజాచార్యులు జన్మించారు.
- బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం పేరిట వ్యాఖ్యానం రాశాడు.
- ఆది శంకరాచార్యుల మాయావాదాన్ని తిరస్కరించాడు.
- జ్ఞానమార్గంతోపాటు భక్తి, కర్మ మార్గాలనూ ప్రతిపాదించాడు.
- శ్రీవైష్ణవ తెగను స్థాపించాడు. యమునముని తర్వాత శ్రీరంగం పీఠాధిపతిగా కొనసాగారు.
- మహారాష్ట్రలోని పండరీపూర్‌లో విఠోభా ఆలయాన్ని ఆధారంగా చేసుకుని భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు.
- ఇతని గ్రంథాలు వేదాంతసారం, వేదాంతసంగ్రహం, వేదాంత దీపం, గీతాభాష్యం, శ్రీభాష్యం.
- సిద్ధాంతం విశిష్టాద్వైతం.
మధ్వాచార్యులు:
- కర్ణాటకలోని ఫాకజ అనే ప్రాంతాంలో మధ్వాచార్యులు జన్మించారు.
- శృంగేరి ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు.
- ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించాడు.
- చాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యక తదితర ఉపనిషత్తులకు భాష్యాలు రాశాడు.
- ఆత్మ, పరమాత్మ వేర్వేరు అని బోధించాడు.
- ఇతని అనుచరులను మధ్య వైష్ణవులు అంటారు.
- ఈ మతాన్ని కన్నడ బ్రాహ్మణులు మాత్రమే స్వీకరించారు.
- అద్వైతాన్ని వ్యతిరేకించాడు. మత భేదాలను, వర్ణధర్మాలను సమర్థించాడు.
- మధ్వాచార్యుని ప్రభావంతో కర్ణాటకలో దాసకూట ఉద్యమం ప్రారంభమైంది. దాసకూటం అంటే భగవంతుని సేవకులు అని అర్థం. ఈ ఉద్యమమే మహారాష్ట్రలో పండరీపుర ఉద్యమమైంది.
- ఈయన రాసిన గ్రంథాలు అణువ్యాఖ్యానం, అనుభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం. సిద్ధాంతం ద్వైతం.
భక్తి ఉద్యమం
త్రిమతాచార్యుల సిద్ధాంతాలకు కొనసాగింపుగా ఇస్లాం ప్రభావంతో హిందూ మతంలో భక్తి ఉద్యమం వచ్చింది. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన పట్ల వ్యతిరేకత, కుల వ్యవస్థ ఖండన, మత కర్మకాండలు, తీర్థ యాత్రల పట్ల నిరసన, ప్రాంతీయ భాషల్లో బోధన, హిందూ మహ్మదీయ సఖ్యత భక్తి ఉద్యమ లక్షణాలు.
నింబార్కుడు
11వ శతాబ్దానికి చెందిన ఆంధ్రబ్రాహ్మణుడు. రామానుజాచార్యునికి సమకాలీనుడు. వేదాంత పారిజాత సౌరభం పేరుతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. ఇతని సిద్ధాంతాన్ని ద్వైతద్వైతం అంటారు. దీన్నే భట్టభాస్కరుని భేదాభేద వాదంతో పోలుస్తారు. ఇతను ఉత్తరాదికి వెళ్లి మధురను కేంద్రంగా చేసుకొని రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేశాడు.
రామానందుడు
15వ శతాబ్దానికి చెందిన రామానందుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ వద్ద జన్మించాడు. ఇతనికి 12 మంది శిష్యులను అవదూతలు అని పిలిచేవారు. అన్నివర్గాలకు చెందిన వారిని శిష్యులుగా చేర్చుకున్నాడు. కుల మత భేదాలకు అతీతంగా తొలిసారి భక్తిని ప్రతిపాదించాడు. మొదటి హిందీ భక్తి ఉద్యమకారుడు. ఆనందభాష్యం అనే గ్రంథం రచించాడు. ఇతని గీతాన్ని గురుగ్రంథసాహెబ్లో చేర్చబడింది.
కబీర్:
రామానందుని శిష్యుడైన కబీర్‌కు మధ్యయుగ కారల్ మార్క్స్ అని పిలుస్తారు. విగ్రహారాధన, కర్మకాండను ఖండించాడు. అసంఖ్యాకమైన దోహాలు(ద్విపదలు) రచించాడు. ఇతని శిష్యులను కబీర్ పంథీ అంటారు. ఇతని మరణానంతరం ముస్లిం శిష్యులు మఘర్ వర్గంగాను, హిందూ శిష్యులు సూరత్ గోపాల వర్గంగా ఏర్పడ్డారు. కబీర్ సుక్తులు బీజక అనే గ్రంథరూపంలో ఉన్నాయి. రచనలు సఖీ, శబ్దమంగళ, బసంత్, రేక్తాల్, వోళీ.
గురునానక్:
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. సిక్కు మతాన్ని స్థాపించాడు. పంజాబ్ గవర్నర్ వద్ద గణాంక అధికారిగా పనిచేశాడు. మొదట సూఫీల్లో చేరి తర్వాత బయటకు వచ్చాడు. భగవంతుడు ఒక్కడే అతడు నిరాకరుడని బోధించాడు. ఈయన బోధనలు ఆదిగ్రంథ్గా సంకలనం చేయబడ్డాయి. ఇతని శిష్యులు సిక్కలు అయ్యారు. పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో మరణించాడు.
వల్లభాచార్యుడు: కాశీలో జన్మించాడు. బ్రహ్మసూత్రాలకు అణుభాష్యం అనే పేరుతో వ్యాఖ్యానం రాశాడు. సుబోధిని, సిద్ధాంత రహస్యం అనే వేదాంత గ్రంథాలు రచించాడు. ఇతని వాదాన్ని శుద్ధాద్వైతం అంటారు. వల్లభాచార్యుడి మార్గాన్ని పుష్ఠిమార్గం అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక ఉద్యమకారుడు. ఇతని బిరుదు ఎపిక్యురియన్ ఆఫ్ ద ఈస్ట్.
సూరదాస్:
సూరదాస్ గొప్పకవి, కృష్ణభక్తుడు. ఇతను సూర్‌సాగర్, సూర్సరవాళి, సాహిత్యరత్న అనే గ్రంథాలు రాశాడు. వల్లభాచార్యుని అష్టచివ అనే ఎనిమిది మంది శిష్యుల్లో చేరాడు. ఆగ్రాకు చెందిన అంధకవి. సుందరవిలాసం అనే గ్రంథాన్ని రచించాడు. తన భక్తి గీతాల్లో బ్రిజ్ భాషను ఉపయోగించాడు.
చైతన్యుడు:
1486లో బెంగాల్‌లోని నవద్వీపంలో జన్మించాడు. రాధాకృష్ణుల ఆరాధనను ప్రచారం చేశాడు. ఇతని సిద్ధాంతాన్ని అచింత భేదాభేదవాదం అంటారు. ఇది రామానుజుని విశిష్టాద్వైతాన్ని పోలి ఉంటుంది. తన బోధనలను దశమూల శ్లోక గ్రంథంలో వివరించాడు. మొదటిసారిగా కీర్తనలు ప్రవేశపెట్టాడు. ఇతని అనుచరులు గౌడియ వైష్ణవ మతస్తులుగా పరిగణించబడ్డారు. బెంగాల్ నవాబ్ నసీరుద్దీన్ ఆస్థానంలో నివసించాడు. ఒరిస్సాలోని పూరీలో మరణించాడు.
మీరాబాయి:
రామానందుని శిష్యురాలు మీరాబాయి. భజనలు చేసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. మేవార్ వద్ద రాజారతన్సింగ్కు జన్మించిన మీరాబాయిను రాణాసంగ్రామసింగ్ పెద్ద కుమారుడైన భోజ్‌రాజ్‌తో వివాహం చేశారు. ప్రేమ ఆరాధనతో నిండిన ఆమె అసంఖ్యాక భజనలు బ్రిజ్, రాజస్థానీ, గుజరాతీ భాషల్లో రచించబడ్డాయి. కృష్ణున్ని గిరిధరలాలుగా పూజించింది.
తులసీదాస్:
ఇతను గొప్పకవి, రామభక్తుడు. ఇతను రామాయణాన్ని హిందీ భాషలోకి అనువదించి రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించాడు. రామచరిత మానస్‌ను ప్రాంతీయ గీతగా పరిగణిస్తారు. రాముడిని భగవంతుని అవతారంగా చిత్రీకరించాడు. అక్బర్ సమకాలికుడు.
దాదుదయాల్: ఇతని బోధనలు దాదుదయారాంకీ బాణీ అనే గ్రంథంగా వెలువడ్డాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. బ్రహ్మ, పరబ్రహ్మ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఈయన బోధనలు గురుగ్రంథసాహెబ్ కంటే ముందే సంకలనంగా రూపొందాయి. ఇతని శిష్యుల్లో సుందరదాసు, రజబ్ ముఖ్యులు. ఇతని భక్తి ఉద్యమాన్ని సిపాక్ ఉద్యమం అంటారు.
సూఫీ ఉద్యమం
సూఫీ శాఖ మీద హిందూ, బౌద్ధ, క్రైస్తవ, జొరాష్ట్రియన్ సిద్ధాంతాల ప్రభావం ఉంది. సూఫీ మతానికి మూల సిద్ధాంతం వహదత్ ఉల్ పుజుద్ లేదా జీవైక్యం. ఈ వ్యవస్థలో బోధకుడు (పీర్), శిష్యులు (మురీద్)ల మధ్య అనుసంధానం కీలకమైంది. సూఫీలు ఏకేశ్వరోపాసకులు. వీరిని హిందూ బౌద్ధ సిద్ధాంతాలైన అహింస, భగవద్భక్తి, త్యాగం, సంయమనం లక్షణాలు బాగా ఆకర్షించాయి. వీరికి నమాజ్(ప్రార్థన), హాజ్(తీర్థయాత్ర), రోజా(ఉపవాసం)ల్లో నమ్మకం లేదు. భగవంతునికి సంగీతం ప్రీతిపాత్రమని విశ్వసిస్తారు. భగవంతున్ని చేరడానికి పీర్ అవసరం ఉందని భావిస్తారు. హిందూ సిద్ధాంతాలైన అగ్నిపూజ, యజ్ఞోపనీతధారణ, యోగ మొదలైన వాటిని వీరు అనుసరించారు. సుఫీశాఖలను శిలశిలా అంటారు. ఇవి 14 ఉన్నట్లు అబుల్ ఫజల్ రాశాడు. భారతదేశంలో చిస్తీ, సుహ్రవర్ధీశాఖలు మాత్రమే ప్రసిద్ధి.
చిస్తీశాఖ:
చిస్తీశాఖ స్థాపకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. 1192లో మహ్మద్ ఘోరీ సైన్యంతోపాటు ఖ్వాజా మొయినుద్దీన్ చిత్తీ భారత్‌కు వచ్చి అజ్మీర్‌లో స్థిరపడ్డాడు. ఈయన సమాధి అజ్మీర్‌లో ఖ్వాజీసాహెబ్ దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఏకేశ్వరోపాలనను ప్రతిపాదించాడు. చిస్తీశాఖకు చెందిన పీర్లలో షేక్ నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తీ ముఖ్యులు. షేక్ నిజాముద్దీన్ ఔలియా సమాధి ఢిల్లలో ఉంది. దీన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించాడు. ఔలియా శిష్యుల్లో ప్రముఖుడైన షేక్ నాసరుద్దీన్ మహ్మద్ చిరాగ్ ఇ డిల్లీ అని కీర్తించబడ్డాడు. నాసరుద్దీన్ మహ్మద్ శిష్యుల్లో సయ్యద్ గేసు దరాజ్ ముఖ్యుడు. ఇతను పేదలను అమితంగా ప్రేమించడంతో బందనవాజ్ అని పిలువబడ్డాడు.
సుహ్రావర్దీశాఖ:
ఈ శాఖ స్థాపకుడు బాగ్దాద్ వాస్తవ్యుడైన షేక్ షిహాబుద్దీన్ సుహ్రావర్దీ. దీన్ని భారతదేశంలో వ్యాప్తి చేసినవాడు షేక్ షిహాబుద్దీన్ జకారియా సుహ్రావర్ది. ఉపవాసాలు చేయడం, దారిద్ర్యాన్ని అనుభవించడాన్ని జకారియా వ్యతిరేకించాడు. హిందూ మతాచారా ప్రభావం పడకుండా చూసుకున్నాడు. జకారియాకు ఇల్తుత్మిష్ షేక్ ఆల్ ఇస్లాం అనే బిరుదును ఇచ్చి సత్కరించాడు. ఖ్వాజా కుతుబుద్దీన్ భక్తియార్ కాకీ సుహ్రవర్ది వ్యవస్థకు చెందినవాడు. ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌లో గల ఇతడి సమాధిని ప్రజలు మతాలకు అతీతంగా కొలుస్తారు.
నయా సూఫీలు: 17వ శతాబ్దంలో కొన్ని శాఖలు ప్రవచించిన వేర్పాటు ధోరణులను ఖండిస్తూ సర్వమానవ ఏకత్వాన్ని ప్రతిపాదించిన సూఫీలను నయా సూఫీలు అంటారు. నయా సూఫీల్లో ముఖ్యుడు ఢిల్లీలో నివసించిన యారీసాహెబ్. వీరిలో మొదటివాడు షాకరీం.