కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 30డేస్ ప్లాన్
తెలంగాణాలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్ 21న నిర్వహించనున్నారు. దాదాపు 6.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులతో పాటు ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల పుస్తకాలు పట్టని వారూ కూడా ఈ 30 రోజులు సద్వినియోగం చేసుకుంటే ప్రిలిమ్స్ పరీక్ష గట్టెక్కవచ్చు. అందుకు ఈ థర్టీ డేస్ ప్లాన్‌లో భాగంగా ఎలా చదవాలి..? అటిట్యూడ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీష్ ఈ ఐదు సబ్జెక్టుల్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి..? మాక్ టెస్ట్‌లు, గ్రాండ్‌టెస్ట్‌లు ఎలా రాయాలి..? మ్యాథ్స్ స్టూడెంట్స్‌తో పాటు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్లాన్ ఎలా ఉండాలనే విషయాలను సబ్జెక్ట్ నిపుణుల సాయంతో ‘మెరుపులు’ merupulu.com వెబ్సైట్ ద్వారా అందిస్తున్నాం.. చివరి వరకు ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదివి పోలీస్ ఉద్యోగానికి నిర్వహించే సెమీఫైనల్ ప్రిలిమ్స్‌లో విజయం సాధించండి.
ఆల్ ది బెస్ట్…
- ముందుగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారందరికీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ భారంగా అనిపిస్తుంది. ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఎండ్ చేయాలనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ 30 రోజుల్లో కరెంట్ అఫైర్స్‌లో పట్టు సాధించడం కోసం ఇప్పటి వరకు జరిగిన నేషనల్ ఇంటర్నేషన్ సమ్మిట్స్, వాటి నిర్ణయాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ న్యూస్, బడ్జెట్ ఎకనామిక్ సర్వే, అవార్డ్స్, కోవిడ్ సమాచారం, కోవిడ్ తర్వాత జాతీయ, అంతర్జాతీయంగా వచ్చిన కీలక మార్పులు, రష్యా ఉక్రెయిన్ వార్, శ్రీలంక క్రైసిస్, ఈ ఏడాది వార్తల్లో వ్యక్తులు, ముఖ్యాంశాలు చదవాలి. వీటితో పాటు కరెంట్స్ అఫైర్స్‌ను మిగతా సబ్జెక్ట్‌లకు అనువదిస్తూ చదవాలి..
ఉదాహరణకు ఇటీవల రష్యా ఉక్రెయిన్‌కు జరిగిన యుద్ధం గురించి చదివినప్పుడు ఇండియన్ హిస్టరీలో జరిగిన యుద్దాలు, కారణాలు, తదనంతర ఫలితాలు ఇలా రిలేటెడ్ అంశాలను నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే కరోనా సంబంధించి కరెంట్ అఫైర్స్‌లో చదివేటప్పుడు ఈ తరహా వ్యాధులు గతంలో వచ్చాయా? అప్పుడు ఎలాంటి నష్టం జరిగింది. ఆ వ్యాధులను అడ్డుకునేందుకు ఆయా దేశాలు చేపట్టిన చర్యలు ఏమిటి? అనే రిలేటెడ్ అంశాలను చదివితే ప్రయోజనం ఉంటుంది.
- ఇక తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్‌ను చదవాలంటే పోస్ట్‌పోన్ చేస్తుంటారు. కానీ ఇంగ్లీష్ అనేది ప్రస్తుతం నిత్యజీవితంలో భాగం అంతే కాకుండా ప్రతి కాంపిటీటేవ్ పరీక్షలో ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు వొకాబ్లరీ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అదే స్థాయిలో గ్రామర్ పార్ట్‌ను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ సంబంధించి ప్రతి రోజు ఒక గంట సమయం ఈ 30 రోజుల్లో ఇంగ్లీష్‌కు కేటాయిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
- మ్యాథ్స్ స్టూడెంట్స్ సంబంధించి ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఈజీగా చేయగలుగుతారు. అలా అని పూర్తిగా చదవకపోవడం వల్ల బేసిక్ అంశాలు మరిచిపోయి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి ఉదాహారణ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. ఇక నాన్ ఆప్టిట్యూడ్‌లో 20 టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్‌లో 25 మొత్తం 45 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నాపత్రాలను గమనిస్తే.. ఎక్కువ మార్కులు వచ్చిన టాపిక్‌లు నంబర్ సిస్టమ్, ఆవరేజెస్, ఏజెస్, పర్సంటేజెస్, ఫ్రాఫిట్స్ అండ్ లాస్, పార్ట్‌నర్‌షిప్, టైమ్ అండ్ ఇంట్రెస్ట్, క్లాక్స్ అండ్ క్యాలెండర్. వీటి నుంచే తరుచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ టాపిక్స్‌పై ఉన్న ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయండి.
- ప్రతి టాపిక్‌లో ఉన్న ఫార్మూలాస్ అన్ని ఒక నోట్‌బుక్‌లో ఒకే దగ్గర రాసుకోండి. ఇలా చేస్తే కన్ఫ్యూజ్ కాకుండా చివరి సమయంలో ఏదీ మిస్‌కాకుండా చదివే అవకాశం ఉంది. వీటిని రెండుమూడు రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటాయి.
- తెలంగాణ హిస్టరీ, కల్చర్, ఉద్యమం సంబంధించి.. రాజులు, రాజ్యాల పరిపాలనా కాలాలు, తొలి, మలిదశ ఉద్యమాల వివరాలు, రాజకీయ పార్టీల పాత్రతో పాటు, తెలంగాణాలో పండుగలు, జాతరలు, ప్రత్యేకతలు, భాషా, యాస పదాల వాడుకలు ఉన్న ప్రాంతాలు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన సంస్కరణలు, ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశ్యాలు వంటి అంశాలను చదవితే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ 30 రోజుల్లో తెలంగాణ కు సంబంధించి 10 నుంచి 20 టాపిక్స్ డివైడ్ చేసుకుని ప్రతి మూడు రోజులకు ఒక టాపిక్ పూర్తి చేసి అదేరోజు గ్రాండ్ టెస్ట్ రాస్తే మంచి పట్టు సాధించవచ్చు.
- ఇక ఇండియన్ హిస్టరీ సంబంధించి బౌద్ధ, జైన మతాల నుంచి భక్తి ఉద్యమాల వరకు, మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు, మొగల్ సామ్రాజ్యం, మరాఠాలు, 1857 తిరుగుబాటు, అతివాదులు, మితవాదులు, గాంధీయుగం, 1947 స్వాతంత్య్రం వరకు ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ మరియు ఈజీ కాబట్టి ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఈ 30 రోజుల్లో డివైడ్ చేసుకుని రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఆధునిక భారతదేశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయడం ఇబ్బందికరమే.. మ్యాథ్స్ సబ్జెక్ట్ అర్థం కాకపోవడంతోనే ఇంటర్, డిగ్రీల్లో ఆర్ట్స్ వైపు వెళ్తుంటారు. అయినా పోటీ పరీక్ష ఏదైనా మ్యాథ్స్ ప్రశ్నలు ఒక తలనొప్పిగా భావిస్తారు. ఇక పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించి ఆప్టిట్యూడ్, రీజనింగ్ 50 మార్కులు వదిలేస్తే మిగతా 150 మార్కులపై ఎక్కువ దృష్టి పెడితే ఎలిజిబులిటీ కోసం 60 మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. వీరు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అంశాలు ఏదీ మిస్ కాకుండా చదివితే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లోనూ విజయం సాధించవచ్చు.
- ఈ చివరి సమయంలో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాలుగు వారాల్లో కనీసం 10 నుంచి 20 గ్రాండ్ టెస్ట్‌లు రాసేలా ప్లాన్ చేసుకోవాలి. రాసిన ప్రతి గ్రాండ్ టెస్ట్‌ను రివ్యూ చేసుకుని ఎక్కడ తప్పులు చేశామని గుర్తించి తర్వాతి టెస్ట్‌లో ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్టుల కోసం ‘మెరుపులు’ merupulu.com ను సంప్రదించవచ్చు.
- ఇప్పటి వరకు కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ సంబంధించి డెయిలీ మాక్ టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించాం. ఇందులో 100 శాతం సిలబస్ కవర్ చేస్తూ ఇంపార్టెంట్ ప్రశ్నలు అందించాం. వీటిని మీ మొబైల్లో ఉచితంగా ఏ సమయంలోనైనా అటెండ్ చేయవచ్చు. స్టడీ మెటిరీయల్ తో పాటు న్యూమరికల్ ఎబిలిటీ టెస్టులు, తెలుగు అకాడమీ బుక్స్ నుంచి తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రామాణికమైన బిట్ బ్యాంక్ ను ప్రతి రోజు అందిస్తున్నాం. వీటితో పాటు జనరల్ సైన్స్, డెయిల్ టెస్టులు, కరెంటు అఫైర్స్ అన్నీ పోటీ పరీక్షల కొత్త సిలబస్‌కు అనుగుణంగా merupulu.com అందిస్తూను ఉంది. గత రెండు నెలలుగా నిర్వహించిన పాత టెస్టులు కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి.
డెయిల్ అప్ డేట్స్ మీరు వెంటనే అందుకావాలంటే వాట్సాప్ లేదా టెలీగ్రామ్ గ్రూపులో జాయినవండి. (పోస్టు కింద లింక్ మీద క్లిక్ చేయండి) - ఇప్పటి వరకు జరిగిన ప్రతి టెస్ట్ అటెండ్ చేస్తే పోలీస్ ఉద్యోగం సాధించాలనే మీ కల తప్పకుండా సాకారం అవుతుంది. ఆల్ ది బెస్ట్….
- DONT MISS TO READ :
- భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
- వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
- తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
- తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
- తెలంగాణ ప్రభుత్వ పథకాలు
- తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
- జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
- విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
- స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
- రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
- భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్