ఏపీలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మే 15లోగా ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, సీట్ల వివరాలు :
ఎంపీసీ -1340, బైపీసీ -1340, సీఈసీ -900, హెచ్ఈసీ -720, ఎంఈసీ -40, ఎఆండ్ టి -280, సీజీఏ 90.
మొత్తం సీట్లు -4710