తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ ( TS EAPCET -2024)పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. సోమవారం ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే రిలీజ్ చేసిన అధికారులు..తాజాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసువచ్చారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా రాష్ట్రంలో మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7,8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9.10.11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఈఏపీ సెట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.