Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSభారతదేశ చరిత్ర.. ముఖ్య ఘట్టాలు

భారతదేశ చరిత్ర.. ముఖ్య ఘట్టాలు

  • 3000-1500 సింధునాగరికత కాలం
  • 576 బుద్ధుడి జననం
  • 527 మహావీరుడి జననం
  • 327-326 భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
  • 313 జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
  • 305 సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
  • 273 – 232 అశోకుడి పాలన
  • 145 – 101 చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
  • 58 విక్రమ శకం ప్రారంభం

Advertisement
  • క్రీస్తు శకం
  • 78 శక యుగం ప్రారంభం
  • 120 కనిష్కుడి పట్టాభిషేకం
  • 320 గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
  • 380 విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
  • 405-411 ఫాహియాన్ భారత సందర్శన
  • 415 మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
  • 455 స్కందగుప్తుడి పట్టాభిషేకం
  • 606-647 హర్షవర్థనుడి పాలనా కాలం
  • 712 మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
  • 836 కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
  • 985 రాజరాజచోళుడి పట్టాభిషేకం
  • 998 సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం

  • 1001 భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
  • 1025 గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
  • 1191 మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది.
    పృథ్విరాజ్ విజయం సాధించాడు.
  • 1192 తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
  • 1206 కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
  • 1210 కుతుబుద్దీన్ ఐబక్ మరణం
  • 1221 భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
  • 1236 రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
  • 1240 రజియా సుల్తానా మరణం.
  • 1246 బాల్బన్ పాలన ప్రారంభం
  • 1296 అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
  • 1316 అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
  • 1325 మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
  • 1327 తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
  • 1336 దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
  • 1351 ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
  • 1388 ఫిరోజ్ తుగ్లక్ మరణం
  • 1398 భారత్ పై తైమూర్ దండయాత్రలు
  • 1469 గురునానక్ జననం
  • 1494 ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
  • 1497-98 భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.

  • 1526 మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
  • 1527 కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
  • 1530 బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
  • 1539 హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
  • 1540 కనౌజ్ యుద్ధం
  • 1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
  • 1556 రెండో పానిపట్టు యుద్ధం
  • 1557 గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
  • 1565 తల్లికోట యుద్ధం
  • 1576 హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
  • 1582 దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
  • 1597 రాణా ప్రతాప్ మరణం
  • 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
  • 1605 అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
  • 1611 నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
  • 1616 జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.
  • 1627 శివాజీ జననం. జహంగీర్ మరణం.
  • 1628 షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
  • 1631 ముంతాజ్ మహల్ మరణం.
  • 1634 భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
  • 1659 సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
  • 1665 శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
  • 1666 షాజహన్ మరణం.
  • 1675 సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
  • 1680 శివాజీ మరణం.
  • 1684 బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
  • 1707 ఔరంగజేబు మరణం.
  • 1708 గురుగోవింద్ సింగ్ మరణం.
  • 1780-84 రెండో మైసూర్ యుద్ధం.
  • 1784 పిట్స్ చట్టం.
  • 1790-92 మూడో మైసూర్ యుద్ధం
  • 1793 బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
  • 1799 నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.

Advertisement
  • 1802 బేసిన్ ఒప్పందం
  • 1809 అమృతసర్ ఒప్పందం
  • 1828 రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
  • 1829 సతీసహగమన ఆచారం నిషేధం
  • 1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
  • 1833 రాజారామమోహన్ రాయ్ మరణం.
  • 1838 కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
  • 1839 మహారాజా రంజిత్ సింగ్ మరణం
  • 1839-42 మొదటి ఆగ్రా యుద్ధం
  • 1845-46 మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
  • 1852 రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
  • 1853 బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
  • 1857 సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
  • 1867 బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
  • 1869 మహాత్మా గాంధీ జననం
  • 1875 స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
  • 1876 సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
  • 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
  • 1885- 1905 మితవాద యుగం
  • 1889 జవహర్ లాల్ నెహ్రూ జననం
  • 1893 చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
  • 1897 సుభాస్ చంద్రబోస్ జననం

  • 1904 టిబెట్ యాత్ర
  • 1905 లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
  • 1906 ముస్లిం లీగ్ స్థాపన
  • 1906-1920 అతివాద యుగం
  • 1909 మింటో – మార్లే సంస్కరణలు
  • 1911 ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
  • 1913 గదర్ పార్టీ ఏర్పాటు
  • 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
  • 1915 భారత దేశానికి గాంధీజీ రాక.
  • 1916 కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
  • 1917 చంపారన్ ఉద్యమం
  • 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
  • 1919 మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
  • 1920 ఖిలాఫత్ ఉద్యమం
  • 1921 ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
  • 1922 చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
  • 1922 మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
  • 1926 భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
  • 1927 సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
  • 1928 పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
  • 1929 మీరట్ కుట్ర కేసు
  • 1929 లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
  • 1930 సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
  • 1931 గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
  • 1932 మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
  • 1935 భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
  • 1937 ప్రొవిన్షియల్ అటానమీ.
  • 1939 రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
  • 1941 రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
  • 1942 క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
  • 1942-44 ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
  • 1945 వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
  • 1946 క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.

  • 1947 అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
  • 1948 గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
  • 1949 కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
  • 1950 గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
  • 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
  • 1952 లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
  • 1956 రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
  • 1957 దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
  • 1963 పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.
  • 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
  • 1965 భారత్ పై పాకిస్థాన్ దాడి
  • 1966 తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.
  • 1967 నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
  • 1969 భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
  • 1970 రాష్ట్రంగా మేఘాలయ
  • 1971 కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
  • 1972 సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
  • 1973 మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
  • 1974 భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
  • 1975 ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
  • 1976 భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
  • 1977 ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం
    సంజీవరెడ్డి.
  • 1979 ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
  • 1980 ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
  • 1982 మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
  • 1983 ఢిల్లీలో చోగమ్ సదస్సు
  • 1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.
  • 1985 రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
  • 1986 మిజోరాం ఒప్పందం
  • 1987 రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
  • 1989 అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
  • 1990 వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
  • 1991 జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.
  • 1992 ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
  • 1993 జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
  • 1994 పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
  • 1995 ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
  • 1996 హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
  • 1997 భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
  • 1998 మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
  • 1999 డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.

Advertisement
  • 2000 అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
  • 2001 జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
  • 2002 అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.
  • 2003 ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
  • 2004 సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్

DONT MISS

తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్​ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్​ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్​ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్​ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్​లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్​ గవర్నర్​ జనరల్స్​
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!