పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోట్స్ తయారు చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం.. చరిత్ర.. సంస్కృతి నుంచి అత్యధిక మార్కులు సాధించాలంటే.. అభ్యర్థులు వీటిని పదే పదే చదువుకోవాలి. గుర్తుంచుకోవాలి.
తెలంగాణలో ముఖ్య గ్రంథాలయాలు
- 1872 – సికింద్రాబాద్ గ్రంథాలయం – సోమసుందర్
- మొదలియార్ (తెలంగాణలో తొలి గ్రంథాలయం)
- 1872- ముదిగొండ శంకరాధ్యులు – సికింద్రాబాద్
- 1892 – అసఫియా లైబ్రరీ (ప్రస్తుత స్టేట్ సెంట్రల్ లైబ్రరి)
- 1895 – భారత గుణవర్ధక లైబ్రరి శాలిబండ
- 1896 – ఆల్బర్డ్ రీడింగ్ రూం – బొల్లారం
- 1901 – శ్రీకృష్ణ దేవరాయల భాషానిలయం- హైదరాబాద్లోని రాంకోఠి (రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు. పార్థసారధి అప్పారావు.. నలుగురు కలిసి స్థాపించారు.)
- 1904 – రాజ రాజనరేంద్ర భాషా నిలయం – వరంగల్
- 1906 – విజ్ఞాన చంద్రికా మండలి – (స్థాపకులు కొమర్రాజు లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు)
నిజాం కాలంలో హైదరాబాద్లో స్కూళ్లు, కాలేజీలు
హైదరాబాద్ మెడికల్ స్కూల్ | 1846 | |
దార్-ఉల్-ఉలూమ్ ఓరియంటల్ కాలేజి (పంజాబ్ యూనివర్సిటికి అనుబంధంగా) | 1856 | |
సిటీ స్కూల్, ఇంజనీరింగ్ స్కూల్ | 1870 | |
చాదర్ఘాట్ స్కూల్ | 1872 | |
మదరసా-ఇ-అయిజా అలియా స్కూల్ (రాజ కుటుంబీకుల, ప్రముఖుల పిల్లల కోసం ఏర్పాటు) | 1873 | |
నిజాం కాలేజి (మద్రాసు యూనివర్సిటికి అనుబంధంగా – బోధన భాష – ఇంగ్లీషు మొదటి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ) | 1887 | |
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ | 1913 | |
ఉస్మానియా యూనివర్సిటి (బోధనా భాష ఉర్దూ, సెకండ్ లాంగ్వేజ్ – ఇంగ్లీషు) | 1918 |
Your concerns are better than others