ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కేరళలోని తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 2023-24 సంవత్సరానికి గాను టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీల వివరాలు :
- గ్రాడ్యేయేట్ అప్రెంటిస్ 50 ఖాళీలు
- టెక్నీషియన్ అప్రెంటిస్ 49 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య 99
విభాగాలు
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్ మెంట్, క్యాటరింగ్ , టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్
అర్హతలు
సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.