తెలంగాణలో ప్రవేశ పరీక్షల సందడి మొదలైంది. ఇప్పటికే ఎంసెట్, ఐసెట్ కు సంబంధించిన షెడ్యూల్స్ విడుదల కాగా.. తాజాగా లాసెట్, పీజీఈసెట్ షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఈ రెండు షెడ్యూల్స్ ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS ECET-2023:
తెలంగాణలోని వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో డిప్లొమా&బీఎస్సీ(మాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ఈసెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ వెంకట రమణ తదితరులు ఈ రోజు విడుదల చేశారు.
TS ECET-2023: ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: మార్చి 1
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 2
దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీలు..
ఎలాంటి లేట్ ఫీజు లేకుండా: మే 2
రూ.500 లేట్ ఫీజుతో: మే 8
రూ.2500 లేట్ ఫీజుతో: మే 12
అప్లికేషన్ల సవరణకు అవకాశం: మే 8 నుంచి 12 వరకు
హాల్ టికెట్ల డౌన్ లోడ్: మే 15 నుంచి
పరీక్ష తేదీ: మే 20
TS LAWCET-2023, TS PGLCET-2023 :
తెలంగాణలోని వివిధ కాలేజీల్లోని LL.B, LL.M కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే TS LAWCET-2023, TS PGLCET-2023 నోటిఫికేషన్లను సైతం ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ వెంకటరమణతో కలిసి విడుదల చేశారు.
TS LAWCET-2023, TS PGLCET-2023 ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: మార్చి 1
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 2
అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: ఏప్రిల్ 6
రూ.4 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు ఆఖరి తేదీ: మే 3
అప్లికేషన్ కరెక్షన్: మే 4 నుంచి మే 10
హాల్ టికెట్ల డౌన్ లోడ్: మే 16
పరీక్ష తేదీ: మే 16