పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోట్స్ తయారు చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం.. చరిత్ర.. సంస్కృతి నుంచి అత్యధిక మార్కులు సాధించాలంటే.. అభ్యర్థులు వీటిని పదే పదే చదువుకోవాలి. గుర్తుంచుకోవాలి.
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు – స్థాపకులు
1886 | సేద్య చంద్రిక | వ్యవసాయ రంగ – తొలి అనువాద పత్రిక |
1859 | రిసాలతలోబ్బి | వైద్య పత్రిక – ఉర్దూలో |
1864 | దక్కన్ టైమ్స్ | ఇంగ్లీషు పత్రిక |
1892 | మౌలిం-ఎ.షఫిక్ | మౌల్వీ మొహిబ్ హుస్సేన్ |
1913 | హితబోధిని | బండారు శ్రీనివాస శర్మ (తెలంగాణలో పూర్తి స్థాయిలో వెలవడిన తొలి పత్రిక) |
1918 | ది పంచమ | జెఎస్ ముత్తయ్య – ఇంగ్లిష్ మంత్లీ |
1922 | నీలగిరి | నల్లగొండ నుండి వెలువడింది. (షబ్నవీసు వెంకటరామ నర్సింహారావు స్థాపకులు.) |
తెలుగు పత్రిక | వరంగల్ – ఇనుగుర్తి గ్రామం నుండి ఒద్దిరాజు సీతారామ చంద్రరావు, రాఘవ రంగారావు సంపాదకత్వంలో వెలువడింది. | |
1926 మే 10 | గోల్కొండ | సురవరం ప్రతాపరెడ్డి (966లో ఆగిపోయింది. |
1927 | సుజాత | (సురవరం సంపాదకత్వం) |
1927 | రయ్యత్ ఉర్దూ పత్రిక | మందుమల నర్సింగ రావు సంపాదకులు |
1931 | భాగ్యనగర్ పక్ష పత్రిక | భాగ్యరెడ్డి వర్మ |
1941 | మిజాన్ | అడవి బాపిరాజు – సంపాదకత్వం |
1944 | కాకతీయ మాస పత్రిక | పాములపర్తి సదాశివరావు |
1947 | ఇమ్రోజ్ | షోయాబుల్లాఖాన్ సంపాదకులు. |
పయాం | ఉధావ్ రావు – సంపాదకులు. | |