Homeవార్తలుజనవరిలోనే నోటిఫికేషన్లు.. భారీగా కొలువుల భర్తీ

జనవరిలోనే నోటిఫికేషన్లు.. భారీగా కొలువుల భర్తీ


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని నిరుద్యోగుల ఏడాది నిరీక్షణకు త్వరలోనే తెరపడనున్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఇటీవల అనేక సార్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఒకే సారి 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఏడాది క్రితం గత డిసెంబర్ నెలలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

Advertisement


ఏడాదిగా ఎదురుచూపులు


అప్పటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతి సారి ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ.. ప్రతీ సారి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుండటంతో నిరుద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని సర్కార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. వాస్తవానికి డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది.


తుది అంకానికి ఉద్యోగులు విభజన

Advertisement


ప్రస్తుతానికి కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు కొత్త జిల్లాల కేడర్లకు కేటాయింపులు పూర్తయింది. ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు, స్పౌజ్‌ కేటగిరీ కింద ఒకేచోటికి బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. జోనల్, మల్టీజోనల్‌ కేడర్‌ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే.. వైద్యారోగ్యశాఖ, పలు సంక్షేమ శాఖలు మినహా మిగతా అన్నిశాఖల్లో జోనల్, మల్టీజోనల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అభ్యంతరాలు, స్పౌజ్‌ దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ జనవరి 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.


జనవరి చివరినాటికి స్పష్టత


అనంతరం ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వస్తుందని అధికారుల సమాచారం. ఖాళీల స్పష్టత వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెబుతున్నారు. జనవరి చివరి నాటికి కొన్ని విభాగాల్లో అయినా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో గతంలో మాదిరిగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు పక్కాగా నోటిఫికేషన్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆలస్యంగా ఉద్యోగాల భర్తీ ప్రారంభమైనా సరే.. ఉద్యోగాల భర్తీ వేగంగా.. సాఫీగా సాగేలా ఉండాలని సర్కార్ అనుకుంటోంది.

Advertisement

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!