HomeLATESTమే 20 నుంచి జూన్​ 3 వరకు ఆన్​లైన్​లో టెట్​​ ఎగ్జామ్​

మే 20 నుంచి జూన్​ 3 వరకు ఆన్​లైన్​లో టెట్​​ ఎగ్జామ్​

టీచర్​ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఆ ప్రకారం మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Advertisement

అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.400 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ జరుగుతుంది. నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు మార్చి 20న వెల్లడించనున్నారు. పూర్తి వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!