అంతర్జాతీయం
నోబెల్ అవార్డులు
కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. రసాయన శాస్త్ర విభాగంలో ‘క్వాంటమ్ డాట్’లపై పరిశోధనలు చేసిన మౌంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్‌లను బహుమతి వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన పియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌజ్, యాన్ ఎల్ హ్యులియర్‌లు భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
కుల వివక్ష నిషేధ నగరంగా ఫ్రెస్నో
కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరం అమెరికాలో కుల వివక్షను నిషేధించిన రెండో నగరంగా నిలిచింది. గత ఫిబ్రవరిలో సియాటెల్ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. సెప్టెంబరులో కాలిఫోర్నియా చట్టసభలో కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
అమెరికా స్పీకర్ తొలగింపు
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థి పదవీచ్యుతులయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగ్గా 6 ఓట్ల మెజారిటీతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అమెరికా చరిత్రలో స్పీకర్‌ను తొలగించడానికి ఇలా ఓటేయడం 1910 తర్వాత ఇదే మొదటిసారి.
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నాయి.
అణుశక్తితో ప్రయాణించే క్రూజ్ క్షిపణి
అణుశక్తితో ప్రయాణించే క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. బురెవెస్త్‌నిక్ క్రూజ్ క్షిపణితో పాటు సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
నోబెల్ శాంతి అవార్డ్
మానవ హక్కులు పరిరక్షణ, అందరికీ స్వేచ్ఛ నినాదంతో ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీ నడిపిన ఉద్యమానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. మహిళల స్వేచ్ఛకు వేస్తున్న సంకెళ్లను తెంచేయడానికి పోరాడుతుంటే 31 ఏళ్ల జైలు శిక్ష ఖరారవడంతో ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియెల్ నొబోవా
ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా డేనియెల్ నొబోవా ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గొంజాలెజ్‌పై విజయం సాధించారు. నొబోవాకు 52 శాతం, గొంజాలెజ్‌కు 42 శాతం ఓట్లు లభించాయి.35 ఏళ్ల డేనియల్ ఈక్వెడార్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు.
ఇజ్రాయెల్‌లో సమైక్య ప్రభుత్వం
ఇజ్రాయెల్‌లో యుద్ధ సమయంలో అత్యవసర సమైక్య ప్రభుత్వ ఏర్పాటుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రధాన ప్రతిపక్షం సమైక్య ప్రభుత్వంలో చేరడం లేదు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులపై పోరాటంలో కలిసికట్టుగా పని చేయనుంది.
ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం
భారతదేశం బయట అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం అకోకీక్ పట్టణంలో నెలకొల్పారు. సమతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) పేరుతో రూపొందించిన ఈ 19 అడుగుల విగ్రహాన్ని అంబేడ్కర్ బుద్ధిజం ఆవిష్కరించారు.
జాతీయం
బిహార్‌లో 63 శాతం బీసీలే
బిహార్ కుల గణన సర్వే వివరాల్లో మొత్తం 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో 63.13 శాతం బీసీలే ఉన్నారని తేలింది. ఇందులో అత్యంత వెనుకబడిన వారు 36 శాతం, ఇతర వెనుకబడిన వారు 27.13 శాతం ఉన్నారు. ఓబీసీల్లో యాదవులు అత్యధికంగా 14.27 శాతం ఉన్నారు. రాష్ట్రంలో దళితులు 19.65 శాతం ఉన్నారు. గిరిజనులు కేవలం 1.68 శాతమే (22 లక్షలు) ఉన్నారు.
ఇంటర్నెట్ వేగంలో భారత్ ర్యాంక్
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో మొబైల్ డౌన్‌లోడ్ వేగాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత్ 47వ స్థానానికి చేరినట్లు ఊక్లా వెల్లడించింది. 5జీ సేవల ప్రారంభం తరవాత, భారతదేశంలో ఇంటర్నెట్ వేగం 3.59 రెట్లు అధికమైంది.
టాలెంట్ ర్యాంకింగ్
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎమ్డీ) విడుదల చేసిన 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో 56 స్థానం పొందింది. స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది.
భారత వృద్ధి రేటు 6.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో భారతదేశ వృద్ధి రేటు అంచనాలను 6.3 శాతంగా ప్రపంచ బ్యాంకు కొనసాగించింది. ఏప్రిల్ నివేదికలోనూ ఇదే వృద్ధి రేటును బ్యాంక్ పేర్కొంది. 2022–23లో భారత్ 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఫోర్బ్స్ కుబేరుల జాబితా
ఫోర్బ్స్ విడుదల చేసిన 37వ ఎడిషన్‌లో ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నారు. 90.8 బిలియన్లతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. సంపన్నుల్లో అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
ఆపరేషన్ అజయ్
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన పౌరులతోపాటు విదేశీయులు మరణిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో 18000 భారతీయులు నివసిస్తున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ పేరుతో చర్యలు తీసుకుంటుంది.
దేశీయ కుబేరుల్లో అంబానీ టాప్
దేశంలోని కుబేరుల్లో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ ప్రకారం ముకేశ్ అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ సంపద రూ.4.74 లక్షల కోట్లకు తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
ట్రాఫిక్ కష్టాల్లో ఢాకా అగ్రస్థానం
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా టాప్లో నిలిచింది. ఈ జాబితాలో భారతదేశంలోని భివంఢీ (5వ స్థానం), కోల్‌కతా (6వ స్థానం), ఆరా (7వ స్థానం) నగరాలు ఉన్నాయి. అమెరికాలోని ఎన్‌జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో ఈ అధ్యయనం చేసింది.
దేశంలోనే కాలుష్య నగరంగా ఢిల్లీ
దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీఘనపు మీటరుకు 100.1 మైక్రోగ్రాములతో మొదటి స్థానంలో ఉంది. పట్నా (99.7 మైక్రోగ్రాములు), ఫరీదాబాద్ (89 మైక్రోగ్రాములు), నొయిడా (79.1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గగన్యాన్ తొలి పరీక్ష
గగన్‌యాన్ మిషన్‌లో మొట్టమొదటి వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్(టీవీ-డీ1)ను ఈ నెల 21న శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేపడుతారు.
పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ ర్యాంక్
రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గతేడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం.
స్వలింగ వివాహాల చట్టబద్ధతకు నిరాకరణ
స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.
చంద్రయాన్ -3పై వెబ్‌పోర్టల్
ఇస్రో దిగ్విజయంగా చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగంపై పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘అప్నా చంద్రయాన్’ పేరుతో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు.
యువతకు ‘మేరా యువ భారత్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘మేరా యువ భారత్’ (మై భారత్) పేరుతో స్వయం ప్రతిపత్తిగల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15- నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఇందులో ఛాన్స్ ఉంది.
ప్రాంతీయం
ముఖ్యమంత్రి అల్పాహార పథకం
అక్టోబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని సీఎం మొదలుపెట్టారు.
డైనమిక్ గ్రౌండ్‌వాటర్ రిసోర్సెస్
‘డైనమిక్ గ్రౌండ్‌వాటర్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ – 2023’ నివేదిక ప్రకారం 2013లో రాష్ట్ర భూభాగంలో 472 టీఎంసీల జలాలు ఉండగా 2023లో 56 శాతం వృద్ధి చెంది 739 టీఎంసీలకు చేరాయని పేర్కొంది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.
మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య రూ.1,932 కోట్లతో మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. దీంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.
త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి
రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. 1983, 1985, 1999లలో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వార్తల్లో వ్యక్తులు
సచిన్ టెండుల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను వన్డే ప్రపంచకప్ ‘గ్లోబల్ అంబాసిడర్’గా ఐసీసీ నియమించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందు సచిన్ ట్రోఫీతో వచ్చాడు.
కేఎన్ శాంత్‌కుమార్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కేఎన్ శాంత్ కుమార్ ఎన్నికయ్యారు. శాంత్ కుమార్ గతంలోనూ (2013–2014) పీటీఐ చైర్మన్‌గా పనిచేశారు.
షెర్పా కమీ రీటా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమాలయ శిఖరాలను నేపాల్‌కు చెందిన 53 ఏళ్ల షెర్పా కమీ రీటా 42 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పారు.సెవెన్ సమ్మిట్ ట్రెక్ సంస్థ చేపట్టిన 14 శిఖరాల యాత్రలో భాగంగా మౌంట్ మనస్లూను ఆయన అధిరోహించారు. గతంలో నిమ్స్ పుర్జా (41 సార్లు) పేరిట ఈ రికార్డు ఉంది.
ఆదిరెడ్డి అర్జున్
జాతీయ జూనియర్ అండర్-19 చెస్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ ఆటగాడు ఆదిరెడ్డి అర్జున్ సొంతం చేసుకున్నాడు.11వ సీడ్‌గా బరిలో దిగిన అతను టోర్నీలో స్థానిక కుర్రాడు అనద్కత్‌పై నెగ్గి అర్జున్ టైటిల్ సాధించాడు.
స్వాతి నాయక్
ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది.
క్లాడియా గోల్డిన్
పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల వెనకబాటుకు కారణాలను సహేతుకంగా విశ్లేషించిన ప్రముఖ ఆర్థిక చరిత్రకారిణి క్లాడియా గోల్డిన్‌ను అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఆమెను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
యోన్ ఫాసే
తన నాటకాలు, విశిష్ట వచన శైలితో అవ్యక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడైన నార్వే దేశ రచయిత యోన్ ఫాసేకు ఈ ఏటి నోబెల్ సాహిత్య బహుమతిని ప్రదానం చేయనున్నట్లు నోబెల్ సాహిత్య పురస్కార కమిటీ ప్రకటించింది. ఇంతవరకు 40 నాటకాలు, నవలలు, బాలల పుస్తకాలు, కథానికలు, కవితలు, వ్యాసాలు ఫాసే రచించాడు.
తనుశ్రీ కోసరే
ఛత్తీస్‌గఢ్‌లో 9 ఏళ్ల బాలిక 5 గంటల పాటు నిరంతరాయంగా నీటిలో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తనుశ్రీ కోసరే దుర్గ్ జిల్లా పురఈ అనే గ్రామానికి చెందిన తనుశ్రీ కోసరే ఈతపై ఆసక్తితో రోజూ 7 నుంచి 8 గంటల పాటు సాధన చేసేది.
పవన్ సెహ్రావత్
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10 కోసం జరుగుతున్న వేలంలో పవన్ సెహ్రావత్ ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని తెలుగు టైటాన్స్ ఏకంగా రూ.2.60 కోట్లు పెట్టి దక్కించుకుంది. గత సీజన్లో తమిళ్ తలైవాస్ పవన్‌కు రూ.2.26 కోట్లు వెచ్చించింది.
మొహ్మద్ మయిజ్జు
మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో మొహ్మద్ మయిజ్జు దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 54.06 శాతం ఓట్లు దక్కడంతో అధ్యక్షుడిగా నవంబర్ 17న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతారు.
అరిందమ్ బాగ్చీ
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంభోజ్ స్థానంలో సీనియర్ దౌత్యవేత్త అరిందమ్ బాగ్చీ నియమితులయ్యారు. బాగ్చీ 1995 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ఇన్నాళ్లూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా పనిచేశారు.
బాని వర్మ
ప్రభుత్వ రంగ సంస్థ భెల్ డైరెక్టర్‌గా బాని వర్మ నియమితులయ్యారు. గతంలో భెల్ రవాణా వ్యాపారంతో పాటు ఎలక్ట్రానిక్స్ డివిజన్ యూనిట్‌ను నిర్వహించినట్లు కంపెనీ పేర్కొంది. బాని వర్మ ఎనర్జీ, ఇండస్ట్రీ, రవాణా విభాగాల్లో 33 ఏళ్ల అనుభవం ఉంది.
క్రిస్టఫర్ లుక్సాన్
న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నేషనల్ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టఫర్ లుక్సాన్ ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు. యాక్ట్ (ఏసీటీ) పార్టీతో కలిసి ఆయన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
క్లాడియా గోల్డిన్
పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల వెనకబాటుకు కారణాలను సహేతుకంగా విశ్లేషించిన ప్రముఖ ఆర్థిక చరిత్రకారిణి క్లాడియా గోల్డిన్‌ను అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఆమెను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
మొహ్మద్ మయిజ్జు
మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో మొహ్మద్ మయిజ్జు దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 54.06 శాతం ఓట్లు దక్కడంతో అధ్యక్షుడిగా నవంబర్ 17న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతారు.
స్పోర్ట్స్
ఆసియా క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్ అయిదేళ్ల కిందట 70 పతకాలతో నెలకొల్పిన రికార్డును దాటేసింది. ఆర్చరీలో ఒజాస్ ప్రవీణ్‌తో కలిసి జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ నెగ్గింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి త్రో విసరగా, కిశోర్ కుమార్ రజతం నెగ్గాడు.
రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
రెస్టాఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్‌ను చేజిక్కించుకుంది.175 పరుగుల తేడాతో రంజీ ఛాంప్ సౌరాష్ట్రను ఓడించింది. రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ 308, సౌరాష్ట్ర 214 పరుగులు చేశాయి.
ఆసియా క్రీడల ముగింపు
చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 45 దేశాల నుంచి 40 క్రీడల్లో 12,407 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. 2026లో జపాన్లో ఇవి జరగనున్నాయి. ఈ క్రీడల్లో చైనా (383), జపాన్ (188), దక్షిణ కొరియా (190), భారత్ (107లో – 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) పతకాల పట్టికలో వరుసగా తొలి నాలుగు స్థానాలో నిలిచాయి.
డబుల్ప్లో నంబర్ వన్
సాత్విక్ సాయిరాజ్–చిరాగ్‌శెట్టి జోడీ డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచిన భారత తొలి జంటగా నిలిచింది. ప్రకాశ్ పదుకొనె, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ (సింగిల్స్) మాత్రమే ఇప్పటివరకు భారత్ తరఫున నంబర్‌వన్ ర్యాంకు సాధించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఎయిర్ ఫోర్స్ తేజస్ ట్విన్ సీటర్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ట్విన్ సీటర్ భారత వైమానికదళం (ఐఏఎఫ్)లోకి హుందాగా అడుగుపెట్టింది. అధునాతన వ్యవస్థలతో తయారైన ఎల్‌సీఏ తేజస్ అరుదైన యుద్ధ సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల వరుసలో భారత్‌ను చేర్చిందని హెచ్‌ఏఎల్ ప్రకటించింది.
నాసా సైకీ సక్సెస్
విలువైన లోహాలున్న గ్రహశకలంపై పరిశోధనకు – నాసా, సైకీ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్ ద్వారా కేప్ కెనావెరాల్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది ఆరేళ్లు ప్రయాణించి 2029లో ‘16 సైకీ’ అనే గ్రహశకలాన్ని చేరుకుంటుంది.
ఫ్లయిట్ టెస్ట్ సక్సెస్
మనుషులను నింగిలోకి పంపే ప్రయోగంలో ఇస్రో సక్సెస్ సాధించింది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా టీవీ-డీ1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది.టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్లే నింగిలోకి దూసుకెళ్లి తర్వాత బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.