Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsబాసర ట్రిపుల్​​ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్​ BASARA IIIT-2023

బాసర ట్రిపుల్​​ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్​ BASARA IIIT-2023

ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్​ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్​ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. టెన్త్ ఉత్తీర్ణులైన​ విద్యార్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జూన్​ 5వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. జూన్​ 19 అప్లికేషన్లకు తుది గడువు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్​సైట్​ www.rguket.ac.in జూన్​ 26న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.

ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 450 చెల్లించి ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుతో పాటు సర్వీసు చార్జీ అధనంగా రూ. 25 చెల్లించాలి. ఆన్​లైన్​ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, టెన్త్​ హాల్​ టికెట్​, మార్కుల లిస్టు, నివాసం, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్యా నిర్ధారణ సర్టిఫికేట్​, సైనికోద్యోగుల పిల్లలైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్​సీసీ, స్పోర్ట్స్​ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​..

టెన్త్​ లో వచ్చిన జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల జీపీఏలు ఒక్కటైతే వరుసగా గణితం, జనరల్​ సైన్స్​, ఇంగ్లిష్​, సోషల్​లో ఎక్కువగా గ్రేడ్​ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్​ లాంగ్వేజ్​లో ఎక్కువ గ్రేడ్​ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్​ టికెట్​ నంబర్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

DETATILED NOTIFICATION

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!