Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsపోటీ పరీక్షలకు రైలు రవాణా.. ముఖ్యమైన బిట్స్​

పోటీ పరీక్షలకు రైలు రవాణా.. ముఖ్యమైన బిట్స్​

  • ప్రపంచంలో మొదటి రైల్‌ ఇంజన్‌ను ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవెన్సన్‌ (1825) కనుగొన్నాడు. ఇతన్ని ప్రపంచ రైల్వే పితామహుడు అని పిలుస్తారు.
  • మొదటి రైలు 1825 సెప్టెంబరు 27న ఇంగ్లాండ్‌లోని ‘స్టాక్‌ టన్‌- డార్లింగ్‌ టన్‌’ మధ్య
    ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో తొలి ట్రెయిన్‌ సర్వీసు.
  • భారత్‌లో మొట్టమొదటి గూడ్స్‌ రైలు 1851 డిసెంబరు 22న రూర్కీలో ప్రారంభమైంది.
  • మొదటి ప్రయాణికుల రైలు లార్డ్‌ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్‌ 18న బొంబాయి(భోరి భందర్‌)- థానె మధ్య థాల్దాట్‌ గుండా నడిచింది. ఈ రైల్వే లైన్‌ పొడవు 34 కిమీ.
  • 1854 ఆగస్ట్ 15న రెండో రైలు హౌరా -హుగ్లీ మధ్య 24 మైళ్ల దూరం నడిపారు. ఇది తూర్పు భారతదేశంలో మొదటి రైలు నర్వీస్‌
  • దక్షిణ భారతదేశంలో 1856లో మొదటి రైలు సర్వీసు వ్యాసర్బడి జీవ నిలయం నుంచి వల్లజా రోడ్‌ (ఆర్కాట్‌) మధ్య ప్రారంభమైంది. దీని దూరం 64 మైళ్లు
  • ఉత్తర భారతదేశంలో మొదటి రైల్వే సర్వీసు 1859లో అలహాబాద్‌ నుంచి కాన్చూర్‌ వరకు ప్రారంభమైంది. దీని పొడవు 119 మైళ్లు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రైలు 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట మధ్య ప్రారంభమైంది.
  • తెలంగాణలో మొదటి రైలు 1874లో సికింద్రాబాద్‌ – వాడి మధ్య(115.75 మైళ్లు) ప్రారంభమైంది.
  • 1929లో మొట్టమొదటి ఎలక్ట్రిక్​ రైలును నడిపారు. దీని పేరు దక్కన్ క్వీన్​. కళ్యాణ్​ నుంచి పుణె వరకు దీన్ని నడిపారు.
  • దేశంలో మొదటి రైల్వే జోన్‌ – దక్షిణ రైల్వే జోన్‌
  • అతి చిన్న రైల్వే జోన్‌. మెట్రో రైల్వే జోన్‌(కోల్‌కతా) లేదా తూర్పు కోస్తా
    రైల్వే జోన(భువనేశ్వర్‌)
  • మొదటి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన జోన్‌- సెంట్రల్​ రైల్వే జోన్‌(ముంబాయి)
  • మూడు రైల్వే జోన్‌లకు ప్రధాన కార్యాలయంగా ఉన్న నగరం – కోల్‌కతా (తూర్చు రైల్వే, ఆగ్నేయ రైల్వే, కోల్‌కతా మెట్రో రైల్వే)
  • దేశంలో మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య 7308
  • మొదటి రైల్వే స్టేషన్‌- భోరి బందర్‌ (ముంబై 1853)
  • దేశంలో అత్యధిక ష్లాట్‌ ఫామ్‌లను కలిగిన రైల్వే స్టేషన్‌- హౌరా(23 ఫాట్​ ఫామ్స్​)
  • దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవు – 68,103 కిమీ.
  • ప్రపంచంలో రైలు మార్గాల పొడవు అధికంగా గల దేశాలు: అమెరికా, చైనా, రష్యా, భారత్
  • రైలు మార్గం పొడవులలో చిన్నది: వాటికన్‌ సిటీ(1.27 కిమీ.), లెసోతో(1.6 కిమీ)
  • విద్యుదీకరించిన రైలు మార్గాల పొడవు పరంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. విద్యుదీకరించిన రైలు మార్గాల పొడవు: 50394 కి.మీ. మొదటిస్థానం – రష్యా
  • ఉద్యోగుల పరంగా ప్రపంచంలో భారత రైల్వే మొదటి స్థానంలో ఉంది. ఇండియన్‌ రైల్వేలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య- 1.3 మిలియన్లు
  • మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్​ రైల్వే
  • దేశంలో అతిపెద్ద రైల్వే జోన్​ ఉత్తర రైల్వే

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!