HomeLATESTటెన్త్​తో సెంట్రల్​లో 2,049 పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​

టెన్త్​తో సెంట్రల్​లో 2,049 పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) తాజాగా కేంద్రంలోని వివిధ శాఖలు, విభాగాల పరిధిలో మొత్తం 2049 గ్రూప్‌–సీ, గ్రూప్‌–డీ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి పదో తరగతి మొదలు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌ వివరాలు, సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​, సిలబస్‌, ప్రిపరేషన్‌ ప్లాన్​ తెలుసుకుందాం..

Advertisement

పది, పన్నెండో తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్​లో మంచి కొలువు సాధించేందుకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 2,049 ఉద్యోగాల్లో రీజియన్ల వారీగానూ ఖాళీలను పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉండే సదరన్‌ రీజియన్‌లో 90 పోస్టులు ఉన్నాయి.

రెండు అంచెల్లో ఎంపిక: ఎస్‌ఎస్‌సీ పోస్టుల భర్తీకి రెండు దశలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలిదశలో ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో పొందిన మార్కులు, నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనలను అనుసరించి.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్: తొలి దశలో రాత పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాత పరీక్షలో పేర్కొన్న విభాగాలు, అంశాలు అన్ని పోస్ట్‌లలోనూ ఉమ్మడిగా ఉన్నప్పటికీ.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు పేర్కొన్న అర్హత స్థాయిని బట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయి ఉంటుంది. పదో తరగతి అర్హత పోస్ట్‌లకు, ఇంటర్‌ అర్హత పోస్ట్‌లకు, డిగ్రీ అర్హత పోస్ట్‌లకు వేర్వేరు ప్రశ్నలు ఎదురవుతాయి.

Advertisement

సిలబస్​పై అవగాహన ఉండాలి: ఎంపిక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షలో విజయానికి.. అభ్యర్థులు ముందుగా ఆయా పోస్ట్‌లకు నిర్దేశించిన సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో రాణించేందుకు అర్థమెటిక్‌తోపాటు ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. నంబర్‌ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్‌ ఈక్వేషన్స్, టాంజెంట్స్‌ వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో రాణించేందుకు వ్యాకరణంపై పట్టు సాధించాలి. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ మొదలు ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌ వరకూ.. అన్ని రకాల గ్రామర్‌ అంశాలను చదవాలి. ముఖ్యంగా యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి.

Advertisement

జనరల్‌ ఇంటెలిజెన్స్‌: ఈ విభాగంలో గుర్తులు,ప్రాబ్లమ్‌ సాల్వింగ్,రిలేషన్‌ షిప్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, సిమాటిక్‌ అనాల­జీ, ఫిగరల్‌ అనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, డ్రాయింగ్‌ ఇన్ఫరెన్సెస్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌: దీనికి సంబంధించి జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ టాపిక్స్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి.

ప్రీవియస్​ పేపర్స్‌ ప్రాక్టీస్‌: అభ్యర్థులు గత అయిదేళ్లకు సంబంధించిన సీహెచ్‌ఎస్‌ఎల్, సీజీఎల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయడం వల్ల వేగం పెరుగుతుంది. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా పరీక్షకు పూర్తిస్తాయి సన్నద్ధ లభిస్తుది. దీంతోపాటు పోస్ట్‌లకు దరఖాస్తు సమయంలోనే స్కిల్‌ టెస్ట్‌పై స్పష్టత ఏర్పరచుకుని వాటి­కి సంబంధించి కూడా సన్నద్ధత పొందడం మేలు.

Advertisement

రివిజన్ ముఖ్యం: అభ్యర్థులు ప్రిపరేషన్‌లో నిరంతరం రివిజన్‌ కొనసాగించే వ్యూహం అనుసరించాలి. అదే విధంగా ఒక టాపిక్‌ లేదా యూనిట్‌ పూర్తయ్యాక నమూనా పరీక్షలు రాయాలి. అదే విధంగా అన్ని విభాగాలకు సంబంధించి మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వాలి. అర్థమెటిక్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. వాటిద్వారా ముందుగా కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకుని.. అప్లికేషన్‌ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది.

నోటిఫికేషన్​

ఖాళీలు: 2,049 పోస్టులు (ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186) అందుబాటులో ఉన్నాయి.

Advertisement

అర్హత: పోస్ట్‌ల స్థాయిని బట్టి 2024, మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్ట్‌ను అనుసరించి జూన్‌ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి.

పోస్టులు: లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనిష్టంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

Advertisement

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మే 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!