ఎట్టకేలకు ఏపీ ఎస్సై పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ ఫైనల్ ఫలితాలను విడుదల చేసింది. వీటి ద్వారా మెన్, వుమెన్, ఆర్ఎస్ఐ అభ్యర్థుల రిక్రూట్ మెంట్ జరుగుతోంది. 2023 అక్టోబర్ 14,14వ తేదీల్లో జరిగిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్లో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అందులో ఫైనల్ కీ కూడా అందుబాటులో ఉంది. ఈ కీ ద్వారా అభ్యర్థులు తాము రాసిన జవాబులు సరైనవో కాదో తెలుసుకోవచ్చు. పేపర్ 3,4 ఓఎమ్మార్ షీట్లు ఈనెల 8వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకుని వాటిని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇవి భవిష్యత్తులో రివరెన్స్ కోసం ఉపయోగపడతాయి.
ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో రైల్వే శాఖలో 3వేలకు పైగా ఉద్యోగాలు