తెలంగాణలోని వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ (DOST Notification) li ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మే 6న ప్రారంభమై.. జులై 10న ముగియనుంది. అనంతరం జులై 17 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫేజ్ ల వారీగా ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారిక వెబ్ సైట్: https://dost.cgg.gov.in/
ఫేజ్-1:
రిజిస్ట్రేషన్: మే 16 నుంచి జూన్ 10 వరకు
వెబ్ ఆప్షన్స్: మే 20 నుంచి జూన్ 11 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 16
ఫేజ్-2:
రిజిస్ట్రేషన్: జూన్ 16 నుంచి జూన్ 26 వరకు
వెబ్ ఆప్షన్స్: జూన్ 16-27 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 30 న

ఫేజ్-3:
రిజిస్ట్రేషన్: జులై 1 నుంచి జూలై 5 వరకు
వెబ్ ఆప్షన్స్: జులై 1 -6 వరకు
సీట్ల కేటాయింపు: జులై 10 న