యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆల్ ఇండియా సర్వీస్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/ శాఖల్లో పలు ఉద్యోగాలకు నియామక పరీక్షలకు సంబంధించి 2025లో నిర్వహించే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్(ప్రిలిమ్స్) ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ మే 25న, మెయిన్స్ ఆగస్టు 22వ తేదీన జరుగనుంది. మిగతా పరీక్షల వివరాలు కింది విధంగా ఉన్నాయి.