నిరుద్యోగులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో (ఆర్సీఐ) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయింది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు:150
పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ బీటెక్, బీకామ్, బీఎస్‌సీ–40, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్–60, ట్రేడ్ అప్రెంటీస్–50.
అర్హత: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ సబ్జెక్టుల్లో బీటెక్, బీకామ్, బీఎస్సీ, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ట్రేడ్స్‌లో ఐటీఐ ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
అప్లికేషన్స్ ప్రారంభం: 25 జనవరి
చివరితేదీ: 7 ఫిబ్రవరి
వెబ్సైట్: www.drdo.gov.in
డీఆర్‌డీఓలో 150 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలు
Advertisement