గ్రూప్–4 లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ నాలేడ్జ్. రెండో పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీ. మొదటి పేపర్‌తో పోలిస్తే రెండో పేపర్ లో ఎక్కువ స్కోర్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మార్కులు వస్తే జాబ్ సులువుగా మీ సొంతమవుతుంది. TSPSC గ్రూప్ 4 పేపర్ 2.. ఈ సెకండ్ పేపర్ ఎలా ఉంటుంది… పేపర్ 2కు ఎలా ప్రిపేరయితే విజయం సొంతమవుతుందనేది తెలుసుకుందాం.
సెక్రటేరియల్ ఎబిలిటీ సిలబస్. ఇందులో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి.
నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఈ పేపర్ కష్టమనే అపోహ కొందరు అభ్యర్థుల్లో ఉంది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. సిలబస్ లో రీజనింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. 2018లో జరిగిన గ్రూప్–4 పరీక్షలో రీజనింగ్ నుంచే 70 ప్రశ్నలు వచ్చాయి. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్.. అభ్యర్థులు ఎవరైనా కొంచెం మెదడుకు పదును పెడితే వీటిని ఆన్సర్ చేసే వీలుంది.
సిలబస్ ప్రకారం పేపర్–2 సెక్రటేరియల్ ఎబిలిటీలో అయిదు టాపిక్‌లు ఉన్నాయి. ఇందులో రెండు విభాగాలు రీజనింగ్, రెండు విభాగాలు ఇంగ్లిష్, ఒక విభాగం అర్థమెటిక్‌కు సంబంధించినవి.
1
మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
2
లాజికల్ రీజనింగ్
3
కాంప్రహెన్షన్
4
రీ–అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టూ ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్
5
న్యూమరికల్– అర్థమెటికల్ ఎబిలిటీస్
గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే అత్యధికంగా రీజనింగ్ నుంచి (50 శాతం) ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత అర్థమెటిక్ నుంచి ప్రశ్నలను ఇచ్చారు. ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి.
కాంప్రహెన్షన్ ప్యాసేజ్
పేపర్–2లో ఇంగ్లిష్ విభాగంలో రెండు భాగాలు ఉన్నాయి.
రీడింగ్ కంప్రహెన్షన్
సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్
రీడింగ్ కంప్రహెన్షన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి దిగువన ప్రశ్నలను ఇస్తారు. ప్యాసేజ్ అర్థం చేసుకుని ప్రశ్నలను ఆన్సర్ చేయాలి.
సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్‌లో వాక్యాలను క్రమపద్ధతిలో అమర్చాల్సి ఉంటుంది. ఇందులో గ్రామర్, వొకాబులరీ ఉండదు. ఎస్సీఈఆర్టీకి సంబంధించిన 8, 9, 10వ తరగతి ఇంగ్లిష్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. మోడల్ ప్యాసేజ్ లు వరుసగా ప్రాక్టీస్ చేయాలి.
వెల్బర్ రీజనింగ్ లో కేలండర్, గడియారాలు, టైమ్ సీక్వెన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, డెరైక్షన్ టెస్ట్, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్– డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, సీటింగ్ అరెంజ్మెంట్, అర్థమెటికల్ రీజనింగ్, అనాలజీ, ఆడ్ మెన్ అవుట్.. తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
నాన్ వెర్బల్ రీజనింగ్‌లో క్యూబ్స్ అండ్ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, కౌంటింగ్ ఫిగర్స్ ముఖ్యమైనవి.
లాజికల్ రీజనింగ్‌లో వెన్ డయాగ్రమ్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్, సిల్లోజియమ్ (తీర్మానాలు), డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్ ప్రిటేషన్స్ ముఖ్యమైనవి.
మంచి మార్కులు రావాలంటే టేబుల్స్, వర్గాలు, ఘనాలపై పట్టు సాధించాలి. +, -, X, ÷ గుర్తులతో లెక్కలు స్పీడ్‌గా చేయటం ప్రాక్టీస్ చేయాలి. లెక్కలు చేసిన కొద్దీ.. మార్కులు పెరుగుతాయి. సొంతమవుతాయి.
రివిజన్ ముఖ్యం
అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. వారంలో ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ లు ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్, రీజనింగ్ లో ఎక్కువ మార్కులు రావాలంటే ప్రాక్టీస్ అత్యంత కీలకం. సాధన ద్వారానే విజయం వర్తిస్తుంది. ఈ పేపర్లో 70 శాతం మార్కులు తెచ్చుకోగలిగితే జాబ్ గ్యారంటీ.
All tests