తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ జాబ్స్, గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతుండగా.. రెండు రోజుల క్రితం 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా.. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ లాంటి తక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా చాలా వచ్చేశాయి. పోలీస్ ఉద్యోగాల తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నవి అంటే.. గురుకులాల్లోనే అని చెప్పవచ్చు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆ నోటిఫికేషన్ల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే గురుకులాలకు సంబంధించి 9,096 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. మరో 3 వేల ఉద్యోగాలకు సీఎం ఆమోద ముద్ర వేయగా.. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (TREIRB) కసరత్తు చేస్తోంది.
ఈ మొత్తం 12 వేల ఖాళీల్లో అత్యధికంగా TGT, PGT పోస్టులే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. చాలా గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల మూడో వారంలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
Super