ఎక్కువగా చదివితే జాబ్ వస్తుందనేది సరి కాదు. ఏమేం చదవాలో తెలుసుకుంటే జాబ్ వచ్చి తీరుతుంది. గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులందరూ పక్కాగా ఈ మంత్రం పాటించి తీరాలి.
పేపర్ 1 (జనరల్ నాలెడ్జి) లో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఏమేం చదవాలో తెలుసుకుందాం.
సిలబస్‌లో కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్య జీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉన్నాయి.
సిలబస్ మనం పూర్తిగా పరిశీలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ జాగ్రఫీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలు లేవు. ఇండియన్ హిస్టరీలో ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు గురించి కాకుండా కేవలం జాతీయోద్యమం గురించి మాత్రమే ఉంది. అందుకే సబ్జెక్టు మొత్తం చదవకుండా సిలబస్ లో ఉన్న టాపిక్స్‌ను అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ కావాలి.