ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ జేఎన్‌టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో దాదాపు 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశముంది. హైదరాబాద్ జేఎన్టీయూ, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ ఫెయిర్ జరుగుతుంది. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌లో 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, బీఈ, బీటెక్, డిగ్రీ/పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు సూచించారు.
జాబ్ ఫెయిర్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్‌మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. జాబ్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. అభ్యర్థులు ముందుగా నిపుణ వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9848484264, 8790006745 నంబర్లలో సంప్రదించాలని నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు.
ఉర్దూ జాబ్ ఫెయిర్
–––––––––––––––––
గచ్చిబౌలిలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో జనవరి 6న ఉర్దూ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. సెట్విన్, యూత్ అడ్వాన్స్మెంట్ కమిటీ, హైదరాబాద్ వీకర్స్ సెక్షన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ప్రభుత్వ మదరసాలో చదివిన వారితో పాటు టెన్త్, ఐటీఐ, డిప్లొమా, పీజీ కోర్సులు చదివిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని అకాడమీ డైరెక్టర్ మహ్మద్ గౌస్ తెలిపారు.