రాయ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎయిమ్స్ రాయ్ పూర్ ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 80 ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : సీనియర్ రెసిడెంట్..80 పోస్టులు
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యయేట్ మెడికల్ డిగ్రీ- ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. .
వయసు: 45 ఏళ్లకు మించి ఉండకూడదు
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 09-05-2024
ప్రదేశం: కమిటీ రూం, 1వ ఫ్లోర్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, గేట్ నెం.05, ఎయిమ్స్, తాటిబంధ్, జీఈ రోడ్, రాయ్‌పూర్ చత్తీస్‌గఢ్
వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php