ఏపీలోని 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2024-25వ విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదలచేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలతోపాటు ఇతర కేటగిరీకిచెందిన విద్యార్థులు మే 18వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. సెలక్ట్ అయిన విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ తోపాటు వసతి, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ ఉంటుంది.
ప్రవేశ వివరాలు:
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు
సీట్ల వివరాలు:
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపిసి 570, ఇంటర్ బైపీసీ 570, హెచ్ఈసీ 570
మొత్తం సీట్ల సంఖ్య 1,710
అర్హత:
2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.