ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 147 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు కమిషన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పోతుపురెడ్డి భార్గవ్ కు 22వ ర్యాంకు వచ్చింది. మన్నెం అజయ్ కుమార్ కు 44వ ర్యాంకు, భార్గవ్ కుమార్ కు 124వ ర్యాంకు వచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థులు upsc.gov.inవెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.