ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈ మేరకు సంస్థలో 12000 ఉద్యోగ నియామకాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. ఐటీతోపాటు ఇతరత్ర డిపార్టమెంట్లలో నియమకాలకు నోటిఫికేషన్ వేయనున్నట్లు ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులను ఎంపిక చేసి కామన్ స్టాఫ్, అసోసియేషన్ స్టాఫ్ గా దాదాపు 85శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ బ్యాంకింగ్ ను అర్థం చేసుకునేవిధంగా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2,32,296కి పడిపోయినట్లు వెల్లడించారు. టెక్నికల్ స్కిల్స్ కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.