రైల్వే శాఖలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో 4600ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సమీపిస్తోంది. అసక్తి ఉండి అర్హులైన అభ్యర్థులు మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు 4,600..ఇందులో 4,208 కానిస్టేబుల్ , 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా రాత పరీక్ష ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్ తదితర పరీక్షల ఆధారంగా సెలక్ట్ చేస్తారు.