సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమల్లో జాబ్ పొందడంతో పాటు బీటెక్ కూడా చదివే అవకాశం ఉంది.
కోర్సులు: మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), 18 నెలల పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/ క్యామ్ (పీడీ-పీఎండీ విత్ క్యాడ్/ క్యామ్), రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ).
అర్హత: కోర్సును అనుసరించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఉపాధి అవకాశాలు: సీపెట్ లోని ప్లాస్టిక్ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ తయారీ సంస్థలే కాకుండా ఫార్మా రంగంలోనూ వీరికి అవకాశాలున్నాయి. ల్యాబ్‌లు, రీసెర్చ్ సెంటర్లు, పెట్రో ఆధారిత పరిశ్రమలు సైతం వీరిని తీసుకుంటున్నాయి. సొంతంగా కూడా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తున్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు మే 31 తేదీ లోపు అప్లై చేసుకోవాలి. సీపెట్ అడ్మిషన్ టెస్ట్ జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.cipet.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.