భారతపోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 19 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు మే 31, 2024వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్ లైన్, పోస్ట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
అర్హత:
ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
అభ్యర్థులు మే 31, 2024 నాటికి గరిష్టంగా 56 ఏళ్లకు మించి ఉండకూడదు. రిజర్వేషన్ కు లోబడి వయస్సులో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జీతం వెల్లడించలేదు. అనుభవం, పనితీరుపై జీతం ఆధారపడి ఉంటుంది.