HomeLATESTఇంటర్​ పరీక్షల తేదీల్లో మార్పు

ఇంటర్​ పరీక్షల తేదీల్లో మార్పు

ఇంటర్ ఎగ్జామ్ తేదీలు మారనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అందుకు సంబంధించిన టైమ్​ టేబుల్​ను ఇంటర్​ బోర్డు గత నెలలోనే రిలీజ్​ చేసింది. తాజాగా జేఈఈ మెయిన్​ పరీక్షల తేదీలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్స్​ ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ జరుగనుంది. అదే తేదీల్లో రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షలు కూడా జరగాల్సి ఉండటంతో సమస్య తలెత్తింది. ఇంటర్​ షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్ 20న ఇంటర్ సెకండ్ లాంగ్వేజీ పేపర్–1, 21న సెకండ్ లాంగ్వేజీ పేపర్–2 పరీక్షలున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలు, ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీలు ఒకే రోజు జరగనుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ రెండు పరీక్షలు జరిగే తేదీలను మార్చాల్సి ఉంటుందని ఇంటర్​ బోర్డు అధికారులు చెపుతున్నారు. లేదంటే కొత్త టైమ్​ టేబుల్​ రిలీజ్​ చేసే అవకాశాలున్నాయని, ఒకటీ రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందిని బోర్డు వర్గాలు తెలిపాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!