HomeLATESTఐఐఎస్సీ, బెంగళూరులో పీజీ, పీహెచ్​డీ కోర్సుల్లో అడ్మిషన్స్​

ఐఐఎస్సీ, బెంగళూరులో పీజీ, పీహెచ్​డీ కోర్సుల్లో అడ్మిషన్స్​

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ/ పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఆన్​లైన్​లో మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు(పీహెచ్‌డీ/ఎంటెక్‌(రీసెర్చ్‌): ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో అడ్మిషన్స్​ ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు వాలిడ్‌ గేట్‌/నెట్‌ అర్హత ఉండాలి.

ఇంజనీరింగ్‌ కోర్సులు(ఎంటెక్‌/ఎండిజైన్‌/ఎంమేనేజ్‌మెంట్‌): ఈ కోర్సులకు ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్, బయోఇంజనీరింగ్‌ విభాగాల్లో అడ్మిషన్స్​ కల్పిస్తుంది. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌ /టెక్నాలజీ/డిజైన్‌/ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణులై, వాలిడ్‌ గేట్‌/ సీడ్‌ 2022 స్కోర్‌ ఉండాలి.

సైన్స్‌ కోర్సులు: లైఫ్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్స్​ విభాగాల్లో అడ్మిషన్స్​ ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జామ్‌ 2022/వాలిడ్‌ గేట్‌ అర్హత సాధించాలి.

Advertisement

ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు: ఇందులో బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్,మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ప్రవేశాలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. జామ్‌/జస్ట్‌ 2022 అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: వాలిడ్‌ గేట్‌/నెట్‌/జామ్‌ అర్హత పరీక్షల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని రాతపరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్​లైన్​లో మార్చి 22వ తేదీ వరకు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: www.iisc.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!