ఫుట్ వేర్ డిజైన్‌లో బ్యాచులర్ డిగ్రీ, పీజీ కోర్సుల నోటిపికేషన్ వెలువడింది. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (FDDI) 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లను చేపడుతోంది. ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (AIST) ద్వారా ఈ అడ్మిషన్లు చేపడుతారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుర్సత్, చంఢీగడ్, అంకలేశ్వర్, గుణ, చెన్నై, పట్నా, కోల్‌కతా, రోహ్తక్, చింద్వారా, జోధ్‌పూర్ నగరాల్లో ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు ఉన్నాయి.
డిగ్రీ కోర్సులు
డిగ్రీలో బ్యాచ్‌లర్ ఆఫ్ డిజైన్‌లో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్ గూడ్స్ అండ్ అక్సెసరీస్, ఫ్యాషన్ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ‘రిటైల్ అండ్ మర్చండైజ్’ కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచ్‌లర్ డిగ్రీలో చేరేందుకు ఏదేని గ్రూపులో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రతి క్యాంపస్‌లో 60 సీట్లు ఉంటాయి.
పీజీ కోర్సులు
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో భాగంగా మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు… నోయిడా, చెన్నై క్యాంపస్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫుట్‌వేర్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’ నోయిడా, పట్నా, హైదరాబాద్, చంఢీగడ్ క్యాంపస్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి క్యాంపస్‌లో 60 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయోపరిమితి లేదు. ఏఐఎస్టి స్కోర్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 28 చివరితేది. ఎంట్రెన్స్ జూన్ 19న నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి.
వెబ్సైట్ : www.fddiindia.com
AVAILABLE COURSES AT FDDI HYDERABAD
R. NO | NAME OF PROGRAM | NO. OF SEATS |
---|---|---|
BACHELORS DEGREE PROGRAMMES – 4 YEARS (8 SEMESTERS) | ||
1 | B.Des (Footwear Design & Production) | 60 |
2 | B.Des (Fashion Design) | 60 |
3 | B.Des (Leather Goods & Accessories Design) | 60 |
BACHELORS DEGREE PROGRAMMES – 3 YEARS (6 SEMESTERS) | ||
1 | BBA (Retail & Fashion Merchandise) | 60 |
MASTERS DEGREE PROGRAMMES – 2 YEARS (4 SEMESTERS) | ||
1 | MBA (Retail & Fashion Merchandise) | 60 |