HomeLATESTటీఎస్​ జెన్​కో పరీక్ష వాయిదా

టీఎస్​ జెన్​కో పరీక్ష వాయిదా

తెలంగాణ జెన్​కో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సివిల్‌) మరియు కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పడింది. అక్టోబర్​లో వెలువడ్డ ఈ నోటిపికేషన్​కు సంబంధించి ఈనెల 17న పరీక్ష జరగాల్సి ఉంది. అదే రోజున ఇతర పోటీ పరీక్షలున్నందున, ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు వరుసగా అధికారులకు విజ్ఞప్తులు అందించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్​కు హాజరై సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన సీఎం పరీక్ష వాయిదా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జెన్​కో ప్రకటించింది. తదుపరి తేదీని ఇంకా ప్రకటించలేదు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!