బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా చదువుతున్న యువతకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా బీసీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న ఏ అభ్యర్థి అయినా సరే అధికారిక వెబ్ సైట్ bankofbaroda.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టుకు దరఖాస్తు చేసే ముందు మరిన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.అవేంటో చూద్దాం.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 21 ఏళ్లు, గరిష్ట వయస్సు 65ఏళ్లు ఉండాలి.
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్నానం ఉన్న గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులున ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.