Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనవోదయ పోస్టుల దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు

నవోదయ పోస్టుల దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు

దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తో గడువు ముగియనుంది. ఇటీవల మే 7వరకు పొడిగించిన అధికారులు తాజాగా మరోసారి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు మే 14వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 1,377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు ఇవ్వనున్నారు. అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

తపరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ, డాక్యమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖ, విజయవాడ, గుంటూరు,నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు, తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలో నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవనహర్ నవోదయ విద్యాలయాల హెడ్ క్వార్టర్స్ లలో నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో హెడ్ క్వార్టర్స్ లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ , జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్సు, కేటరింగ్ సూపర్ వైజర్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ ఫ్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 1377.

Advertisement

స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్‌గా లేదా నర్స్ మిడ్ వైఫ్ సభ్యత్వం కలిగి ఉండాలి.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ సంబంధిత విభాగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.

ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: బీకామ్ డిగ్రీతోపాటు అకౌంటింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

Advertisement

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండటం తప్పనిసరి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు (హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి)/ఇంగ్లిష్ నుంచి హిందీలోకి) కోర్సుచేయాలి.

లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 3ఏళ్ల లా ప్రాక్టీస్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ తెలిసి ఉండాలి. డిక్టేషన్‌లో పది నిమిషాల్లో 80 పదాలు, ట్రాన్‌స్క్రిప్షన్‌ – ఇంగ్లిష్ 50 నిమిషాలు, హిందీ 65 నిమిషాలు ఉంటుంది.

Advertisement

కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు
అర్హత: బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) (లేదా) బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ).

కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) (లేదా) ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే ట్రేడ్ ప్రొఫీషియన్సీ సర్టిఫికేట్(కేటరింగ్)తోపాటు డిఫెన్స్ సర్వీసెస్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హతతోపాటు టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

Advertisement

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హతతోపాటు టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టు తప్పనిసరిగా చదవి ఉండాలి.
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటుగా ఐటీఐ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత విభాగంలో 2ఏళ్ల అనుభవం ఉండాలి.

ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతోపాటు డిప్లొమా/సర్టిఫికేట్(ల్యాబొరేటరీ టెక్నిక్) కోర్సు చేయాలి. (లేదా) ఇంటర్ అర్హత ఉండాలి.

మెస్ హెల్పర్: 442 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటుగా ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల మెస్‌లలో కనీసం 5ఏళ్ల పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్‌వీఎస్ స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణులు కావాలి.

Advertisement

మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!