TSPSC చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఆయన కలిశారు. బోర్డుకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇంతలోనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. 2021 మేలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే.